ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రస్తుత రోజుల్లో జరుగుతోన్న పరిస్థితులకు అద్దం పట్టేలా శ్రీ ముఖీ చిత్రం

cinema |  Suryaa Desk  | Published : Sat, Nov 04, 2017, 02:29 PM



తెలుగు యాంకర్ శ్రీ ముఖీ ఒక్క రెండు మూడు టీవీ షోలతో క్రేజ్ సంపాదించుకుందో లేదో గాని సినిమాల్లో మాత్రం మంచి అవకాశాలను దక్కించుకుంటోంది. మొన్నటి వరకు సినిమాల్లో కనిపించినా కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే ఎక్కువగా దర్శనం ఇచ్చిన ఈ భామ ప్రస్తుతం మెయిన్ లీడ్ లో హీరోయిన్ గా అవకాశాలను అందుకుంటోంది. హర్షవర్దన్ తీస్తున్న గుడ్ బ్యాడ్ అగ్లీ తరువాత.. మరో డిఫరెంట్ సినిమాలో కనిపిస్తోందట. 


ప్రస్తుతం ఒక ఫ్యామిలీ ఎమోషన్ డ్రామా తరహాలో సాగే కథలో నటిస్తోంది. వి.ఎస్.వాసు తెరకెక్కిస్తోన్న ఆ సినిమా టైటిల్ ''కుటుంబ కథా చిత్రం''. నందు కథానాయకుడిగా కనిపించబోతున్నాడు. అయితే ఈ సినిమా ఫ్యామిలీ ఎమోషన్ తరహాలో ఉన్నా కూడా ప్రస్తుత రోజుల్లో జరుగుతోన్న పరిస్థితులకు అద్దం పట్టేలా ఉంటుందని దర్శకుడు చెబుతున్నాడు. దర్శకుడు వాసు మాట్లాడుతూ.. ప్రస్తుత రోజుల్లో చాలా వరకు యువ జంటలు పెళ్లి చేసుకోగానే జాయింట్ ఫ్యామిలీ తో కలిసి ఉండడానికి అస్సలు ఇష్టపడడం లేదు. 


ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు మంచి రిలేషన్ తో కలిసి ఉండేవి. ఒకరికి బాధ్యత వస్తే కుటుంబం మొత్తం వారికి తోడుగా ఉండేది కానీ ఇప్పుడు అలాంటి ఆప్యాయతలు కరువవుతున్నాయి. ఒక ప్రాబ్లమ్ వస్తే ఒక్కరే ఎదుర్కోవాలి అనే భావన అందరిలో బలంగా పాతుకుపోయింది. ఈ సినిమాలో ఆ తరహాలో ఉమ్మడి కుటుంబం నుంచి బయటకు వచ్చేసిన నందు - శ్రీ ముఖి ఐటి ఉద్యోగం చేస్తోన్న భార్య భర్తలుగా కనిపిస్తారు. ఒకరికి ఒకరంటే చాలా ఇష్టం. కానీ వారిద్దరి మధ్య మరొక వ్యక్తి ప్రవేశిస్తే వారి జీవితం మొత్తం ఎలా టర్న్ అయ్యిందనే పాయింట్ కూడా ఈ సినిమాలో ఉంటుందని దర్శకుడు చెప్పాడు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com