మహాభారతం గ్రంధాన్ని ఆధారంగా చేసుకొని సినిమా చేయాలని చాలామంది దర్శకులు అనుకుంటున్న సంగతి తెలిసందే. అమీర్ ఖాన్ ఈ సినిమాను చేయాలని అనుకున్నారు. అయితే, దీనిని సినిమాగా కాకుండా.. వెబ్ సిరీస్ గా తీయాలని సంకల్పించారు. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ఏమైందో తెలియదు. రాజమౌళి కూడా మహాభారతాన్ని సినిమాగా చేయాలని అనుకున్న సంగతి తెలిసిందే. అయితే, దీనికోసం కనీసం పదేళ్ళపాటు కష్టపడాల్సి వస్తుందని రాజమౌళి పేర్కొన్నారు. ఈ దర్శక నటులు ఇలా చెప్తుంటే.. బాలీవుడ్ దర్శకుడు రాకేష్ ఓంప్రకాష్ మెహ్రా మహాభారత్ పేరును రిజిస్టర్ చేయించాడు. దీనిపై ఎప్పుడు సినిమా చేయబోతున్నారు. ఎవరెవరు ఇందులో నటిస్తున్నారు.. అనే విషయాలను త్వరలోనే ప్రకటిస్తారట.