ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నవంబర్ 6న భాగమతి ఫస్ట్ లుక్

cinema |  Suryaa Desk  | Published : Mon, Nov 06, 2017, 10:38 AM



టాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ వండర్ బాహుబలి చిత్రంతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్న అనుష్క నటిస్తున్న తాజా తెలుగు చిత్రం భాగమతి. అరుంధతి, రుద్రమదేవి, బాహుబలి చిత్రాల్లో అనుష్క నటించిన తీరు అందర్నీ అబ్బురపరిచింది. ఇదే తరహాలో... భాగమతిగా అనుష్క తన పెర్ ఫార్మెన్స్ తో మెస్మరైజ్ చేయనుంది. భాగమతి ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ రేపు (నవంబర్ 6న) 6.55PM శుభ ముహుర్తాన విడుదల చేయనుంది. ఈ ఫస్ట్ లుక్ తో సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరతాయి. పిల్ల జమీందార్ వంటి సూపర్ హిట్ ఫిల్మ్ అందించిన అశోక్ ఈ చిత్రానికి దర్శకుడు. బంపర్ హిట్ చిత్రాల్ని నిర్మించి.... రెబల్ స్టార్ ప్రభాస్ తో నాలుగు భాషల్లో సాహో వంటి ప్రెస్టీజియస్ చిత్రాన్ని నిర్మిస్తున్న యువి క్రియేషన్స్ బ్యానర్లో వంశీ, ప్రమోద్ భాగమతి చిత్రాన్ని నిర్మిస్తుండడం విశేషం. మథి కెమెరా వర్క్ స్పెషల్ ఎట్రాక్షన్. ఆర్ట్ రవీందర్ వేసిన సెట్స్ గ్రాండియర్ గా ఉంటాయి. తమన్ అందించిన పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రతీ సన్నివేశాన్ని హైలైట్ చేసేదిగా ఉంటుంది. త్వరలోనే సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియజేస్తామని నిర్మాతలు ప్రమోద్, వంశీ తెలియజేశారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com