ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'డిటెక్టివ్‌' నా కెరీర్‌లో వన్‌ ఆఫ్‌ ది బెస్ట్‌ మూవీ : విశాల్‌

cinema |  Suryaa Desk  | Published : Mon, Nov 06, 2017, 02:33 PM



మాస్‌ హీరో విశాల్‌ కథానాయకుడుగా విశాల్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ సమర్పణలో మిస్కిన్‌ దర్శకత్వంలో జి.హరి నిర్మించిన సస్పెన్స్‌ అండ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'డిటెక్టివ్‌'. ఈ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి నవంబర్‌ 10న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాత జి.హరి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో హీరో విశాల్‌, హీరోయిన్‌ ఆండ్రియా, నిర్మాత హరి, మాటల రచయిత రాజేష్‌ ఎ.మూర్తి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా... 


మాస్‌ హీరో విశాల్‌ మాట్లాడుతూ - ''మంచి థ్రిల్లర్‌, ఎంటర్‌టైనింగ్‌గా సాగుతుంది. నాకు నటుడిగా మంచి పేరు, నిర్మాతగా మంచి కలెక్షన్స్‌ సాధించి పెట్టిన చిత్రమిది. అక్టోబర్‌ నెలలో తమిళంలో 'తుప్పరివాలన్‌' పేరుతో తమిళంలో విడుదలై మంచి విజయాన్ని సాధించింది. ఇక్కడ దర్శకుడు మిస్కిన్‌గారి గురించి ప్రత్యేంగా ప్రస్తావించాలి.. ఆయనొక విభిన్నమైన వ్యక్తి.ఈ సినిమాకు ఫైట్స్‌ను ఆయనే కంపోజ్‌ చేసుకున్నాడు. సాధారణంగా ఓ హీరోకు అభిమానులుంటారు. సదరు హీరో సినిమా రిలీజ్‌ అవుతుందంటే కొన్ని ఎక్స్‌పెక్టేషన్స్‌ ఉంటాయి. ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌తో ఆ సినిమాకు మంచి ఓపెనింగ్స్‌ వస్తాయి. కానీ దర్శకుడు మిస్కిన్‌ సినిమాకు ప్రత్యేకంగా అభిమానులుంటారు. అలాంటి ఓ దర్శకుడితో సినిమా చేస్తే, నాకు గుర్తుండిపోయే చిత్రమవుతుందనిపించింది.


మిస్కిన్‌గారి దర్శకత్వంలో ఎనిమిదేళ్లుగా పనిచేయాలని అనుకుంటూ ఉండేవాడిని. కానీ వీలుకాలేదు. చివరకు ఎనిమిదేళ్ల తర్వాత కుదిరింది. ముందు నాలుగైదు లైన్స్‌ అనుకున్నాం కానీ నచ్చలేదు. చివరకు మిస్కిన్‌గారు డిటెక్టివ్‌ కాన్సెప్ట్‌తో చెప్పిన ఈ లైన్‌ బాగా నచ్చింది. నటుడు ప్రసన్న ఇందులో నా స్నేహితుడి పాత్రలో నటించారు. సినిమా హాలీవుడ్‌ స్టాండర్డ్స్‌లో కనపడుతుంది. అను ఇమ్మాన్యుయేల్‌ మంచి పాత్రలో నటించింది. సినిమాలో ఓ గ్రే షేడ్స్‌ ఉన్న లేడీ పాత్ర వుంటుంది. దాన్ని ఎవరూ చేస్తే బావుంటుందని ఆలోచిస్తే..నాకు ఆండ్రియా గుర్తుకు వచ్చింది. తనైతే పాత్రకు న్యాయం చేస్తుందని భావించాం. అనుకున్నట్లుగానే తను పాత్రకు న్యాయం చేసింది. సినిమా కోసం తను పడ్డ కష్టం నాకు తెలుసు. క్లైమాక్స్‌ ఫైట్‌ను పిచ్చాగరం అనే ప్లేస్‌లో షూట్‌ చేశాం. అక్కడ కనీస వసతులు కూడా కల్పించలేం. అటువంటి ప్లేస్‌లో , మురికి నీళ్లలో ఆండ్రియా నటించింది. నా కెరీర్‌లో వన్‌ ఆఫ్‌ ది బెస్ట్‌ మూవీ ఇది. తెలుగు ఆడియెన్స్‌కు కొత్త ఫీల్‌ను ఇస్తుంది. వచ్చే ఏడాది ఈ సినిమాకు సీక్వెల్‌ను ప్లాన్‌ చేస్తున్నాం. వినయ్‌ ఇందులో డెవిల్‌ అనే విలన్‌ పాత్రలో నటించాడు. అలాగే భాగ్యరాజ్‌గారు కూడా నెగటివ్‌ టచ్‌ ఉన్న పాత్రలో కనిపించారు. సినిమాకు బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ మెయిన్‌ ఎసెట్‌గా నిలిచింది. తెలుగు సినిమా సక్సెస్‌లలో మీడియా మెయిన్‌ రోల్‌ తీసుకుంటుంది. బి.ఎ.రాజుగారు వారింటి హీరోలా భావించి సినిమా ప్రమోషన్స్‌ చేస్తుంటారు'' అన్నారు.


.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com