ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెళ్లి, రాజకీయం అనే వార్తల్లో నిజం లేదని అంటున్న'అంజలి'

cinema |  Suryaa Desk  | Published : Mon, Jun 24, 2019, 01:03 PM



తమిళంలో విజయ్ సేతుపతి కథానాయకుడిగా 'సిందుబాద్' నిర్మితమైంది. ఈ నెల 21వ తేదీనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావలసి వుంది. అయితే కొన్ని కారణాల వలన విడుదల ఆగింది. ఈ నేపథ్యంలో తాజా ఇంటర్వ్యూలో ఈ సినిమాను గురించి అంజలి స్పందించింది.


"విజయ్ సేతుపతితో కలిసి గతంలో ఒక సినిమా చేశాను. ఆయనతో నాకు ఇది రెండవ సినిమా. ఈ సినిమాలో ఒక గ్యాంగ్ నన్ను కిడ్నాప్ చేస్తుంది. ఆ గ్యాంగ్ బారి నుంచి ఆయన నన్ను ఎలా కాపాడాడనే కథాంశంతో ఈ సినిమా రూపొందింది. ఇది తప్పకుండా హిట్ అవుతుందనే నమ్మకం వుంది. ప్రస్తుతం  తెలుగులో రెండు .. తమిళంలో రెండు సినిమాలు చేస్తున్నాను. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాననీ .. రాజకీయాల్లో చేరనున్నానని కొంతమంది ప్రచారం చేస్తున్నారు. ఈ రెండు వార్తల్లోను నిజం లేదు" అని ఆమె స్పష్టం చేసింది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com