ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'భాగమతి' ఫస్ట్ లుక్‌

cinema |  Suryaa Desk  | Published : Tue, Nov 07, 2017, 09:21 AM



స్వీటీ అనుష్క ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్. ఆమె ప్రధాన పాత్రలో రూపొందుతున్న హారర్ థ్రిల్లర్ భాగమతి సినిమా ఫస్ట్ లుక్ వచ్చేసింది. భాగమతి ఫస్ట్ లుక్ అంటే ఈ సినిమాలో అనుష్క ఎలా, ఎంత అందంగా వుంటుందో చూపించేదిగా వుంటుందని అభిమానులు ఆశించారు. కానీ వారి అంచనాలని తలకిందులు చేస్తూ అందరికీ భాగమతి ఫస్ట్‌లుక్‌తోనే సర్‌ప్రైజ్ చేశాడు డైరెక్టర్. ఈ సినిమాలో అనుష్క ఎలా కనిపించనుందనే విధంగా కాకుండా అందరికీ ఆసక్తిరేపే విధంగా ఈ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ని ప్రజెంట్ చేశాడు డైరెక్టర్. 


పిల్ల జమిందార్ ఫేమ్ అశోక్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో అనుష్క ఫస్ట్ లుక్ చూస్తే ఔరా అని అనిపించాల్సిందే. ఓ చేతిలో రక్తంతో తడిసిన సుత్తె పట్టుకోగా మరో అరచేతిని గోడకు శిలువేసినట్టుగా శిల కొట్టివుండటం, బ్యాగ్రౌండ్‌లో వున్న ఫోటోలో కాళ్లని గొలుసులతో బంధించి వుండటాన్ని ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో గమనించొచ్చు. ప్రస్తుతం భాగమతి సినిమా సౌండ్ ఎఫెక్ట్స్ వర్క్ జరుగుతోంది. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే సంక్రాంతికి రిలీజ్ కానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com