ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విలేజ్ నేపథ్యంలో రంగస్థలం సినిమా కోసం జాతర సెట్!

cinema |  Suryaa Desk  | Published : Tue, Nov 07, 2017, 10:19 AM



'రంగస్థలం 1985' సినిమా కోసం హైదరాబాద్ - భూత్ బంగ్లా సమీపంలో 'జాతర' సెట్ వేశారు. 1980 నాటి వాతావరణాన్ని ప్రతిబింబించేలా ఈ సెట్ ను రూపొందించారు. ఈ సెట్ కి సంబంధించిన ఒక స్టిల్ ను చరణ్ రిలీజ్ చేయగా .. మరో స్టిల్ ను సమంత వదిలింది. బొమ్మల కొట్లు .. రంగుల రాట్నం .. జనం సందడితో కలర్ ఫుల్ గా వున్న  ఈ స్టిల్ అందరినీ ఆకట్టుకునేలా వుంది. మనాలీలో భార్యతో కలిసి షికారును పూర్తి చేసిన చరణ్, దగ్గుబాటు ఫ్యామిలీతో గెట్ టు గెదర్ పూర్తి చేసిన సమంత నిన్నటి నుంచి ఈ సినిమా షూటింగులో పాల్గొంటున్నారు. జాతర నేపథ్యంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారట. గ్రామీణ నేపథ్యంలో జాతర సీన్లు మాస్ ఆడియన్స్ మనసును పట్టేస్తాయనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ జాతరలో చరణ్ .. సమంత కలిసి చేసే సందడి ఈ రేంజిలో ఉంటుందో చూడాలి మరి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com