ట్రెండింగ్
Epaper    English    தமிழ்

“ఆగ్రహం” టీజర్ ను ఆవిష్కరించిన వర్మ

cinema |  Suryaa Desk  | Published : Wed, Jun 26, 2019, 12:45 AM



 ఆర్. ఎస్ .సురేష్ దర్శకత్వంలో సుదీప్, సందీప్, రాజు, సుస్మిత హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం “ఆగ్రహం”. ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం టీజర్ ను సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ముంబై లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం లో చిత్ర దర్శకుడు సురేష్, నిర్మాత చెరుకూరి సందీప్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మూర్తి ఆడారి, సంగీత దర్శకుడు రవి శంకర్ మొదలగు వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దర్శకుడు సురేష్ మాట్లాడుతూ… 


 ‘ రాజకీయ నేపథ్యంలో రెండు గ్యాంగ్ ల మధ్య జరిగే గ్యాంగ్ స్టర్ కధాంశమిది. ఈ చిత్రం లో 5 ఫైట్స్ ఉంటాయి.’ఆఫీసర్, సర్కార్3 చిత్ర లకు సంగీతాన్ని అందించిన రవిశంకర్ ఆర్ ఆర్ మా చిత్రానికి ప్రధాన ఆకర్షణ’ అని అన్నారు. చిత్ర నిర్మాత సందీప్ మాట్లాడుతూ కంప్లీట్ యాక్షన్ ఎలిమెంట్స్ ఉన్న చిత్రమిది.ఎగ్జికుటివ్ ప్రొడ్యూసర్ అడా రి మూర్తి నేతృత్వంలో ఈ చిత్రాన్ని చాలా పాస్ట్ గా తెర కేకించాం .జులై లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నాం.’ అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com