ఇటీవలి కాలంలో కాస్త వేగంగా మౌత్ టాక్ స్ప్రెడ్ అయిన సినిమాగా గరుడవేగను చెప్పుకోవచ్చు. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన గరుడవేగ కుటాక్ నే వచ్చింది. మంచి సమీక్షలు వచ్చాయి. ముఖ్యంగ దర్శకుడు ప్రవీణ్ సత్తార్ కు మంచి పేరు వచ్చింది. తన మార్క్ ప్రతీ ఫ్రేమ్‌లోనూ చూపించాడు ప్రవీణ్. ఈ సినిమా చూస్తే.. అగ్ర కథానాయకులు సైతం ప్రవీణ్‌తో సినిమా చేయడానికి ఇష్టపడతారు. ఇప్పుడు గరుడ వేగ ఎఫెక్ట్ అప్పుడే మొదలైపోయినట్టు కనిపిస్తోంది. యువ కథానాయకుడు నితిన్… ప్రవీణ్‌తో సినిమా చేయడానికి ముందుకొచ్చాడు.తన సొంత నిర్మాణ సంస్థలోనే ఈ సినిమాని రూపొందించబోతున్నాడు. ఈ విషయాన్ని నితిన్ స్వయంగా తన ట్విట్టర్ ఖాతా ద్వారానే ప్రకటించాడు. పుల్లెల గోపీచంద్ జీవిత కథని సినిమాగా రూపొందించబోతున్నాడు ప్రవీణ్. 2018లో ఈ సినిమా పట్టాలెక్కుతుంది. ఈలోగా నితిన్ సినిమాని మొదలెట్టేసే అవకాశం ఉంది. లై తర్వాత నితిన్ నుండి వచ్చిన అధికారిక సినిమా ప్రకటన ఇదే.