ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏఎన్నార్‌ పాత్రలో యంగ్‌ హీరో..?

cinema |  Suryaa Desk  | Published : Wed, Nov 08, 2017, 11:11 AM



అలనాటి అందాల నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మహానటి పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సావిత్రి పాత్రలో కీర్తిసురేష్‌ నటిస్తోంది. అప్పటి సినీ దిగ్గజాల పాత్రల కోసం ఈ జనరేషన్‌ లోని నటులను ఎంపిక చేస్తున్నారు. ఇప్పటికే దుల్కర్‌ సల్మాన్‌, మోహన్‌ బాబు, ప్రకాష్‌ రాజ్‌, రాజేంద్ర ప్రసాద్‌ లాంటి వారిని ఫైనల్‌ చేయగా దర్శకుల పాత్రలకు క్రిష్‌, తరుణ్‌ భాస్కర్‌ లను తీసుకున్నారు. తాజాగా ఈ లిస్ట్‌లోకి ఓ యువ నటుడు చేరాడు. చాలా రోజులుగా సంచలన హీరో విజయ్‌ దేవరకొండ మహానటిలో నటిస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నా, ఏ పాత్రలో కనిపించనున్నాడో వెల్లడించలేదు.


తాజాగా సమాచారం ప్రకారం​ విజయ్‌, అలానాటి స్టార్‌ హీరో అక్కినేని నాగేశ్వర్రావు పాత్రలో నటించనున్నాడట. ప్రస్తుతం షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ సినిమాలో ఎన్టీఆర్‌ గా ఎవరు కనిపించినున్నారన్న విషయం తెలియాల్సి ఉంది. ఎవడే సుబ్రమణ్యం ఫేం నాగ అశ్విన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను అశ్వనిదత్‌ భారీ బడ్జెట్‌ తో తెరకెక్కిస్తున్నారు. దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ ఒకేసారి రిలీజ్‌ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com