ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పుట్టిన రోజు నాడు గెలుపు ,ఓటమి గురించి స్వీట్ మెస్సేజ్ ఇచ్చిన మంజుల

cinema |  Suryaa Desk  | Published : Wed, Nov 08, 2017, 12:54 PM



సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు సోదరి మంజుల పుట్టినరోజు ఈరోజు. ఈ సందర్భంగా ఆమె ‘మనసుకు నచ్చింది’ అనే టైటిల్‌తో తన జీవితం గురించి ఓ షార్ట్‌ ఫిలిం తీశారు. ఈ వీడియోను మహేశ్‌ ట్విటర్‌లో పోస్ట్‌ చేస్తూ.. ‘నా ప్రియమైన సోదరికిపుట్టినరోజు శుభాకాంక్షలు. చక్కటి ఇనీషియేటీవ్‌’ అని ట్వీట్‌ చేశారు.


వీడియోలో మంజుల మాట్లాడుతూ.. ‘హాయ్‌ నేను మంజుల. అందరి అమ్మాయిలలాగే నాకూ చాలా కలలు ఉండేవి. ఎన్నో సాధించాలనుకునేదాన్ని. కానీ ఏవీ సాధ్యం కాలేదు. నటి కావాలనుకున్నాను. కానీ అవ్వలేకపోయాను. ఎన్నో సార్లు ప్రయత్నించాను. కానీ విఫలమతూనే వచ్చాను. దాంతో సినిమా నిర్మాణంపైదృష్టిపెట్టాను. అది కూడా సంతృప్తి నివ్వలేదు. ఎందుకంటే నాలో ఇంకా నటించాలన్న ఆశ బలంగా ఉండిపోయింది.’





‘ఇందుకు కారణం ఒకటి ఓడిపోవడమైతే.. మరొకటి అవకాశాలు రాకపోవడం. దాంతో నాకు నేనే ఓ బాధితురాలిగా ఫీలయ్యేదాన్ని. ఇందుకు కారణం నా కుటుంబం, నా తండ్రికున్న అభిమానులు, సమాజం అనుకునేదాన్ని. ఆ తర్వాత నాకు అర్థమైంది. అసలు కారణం నేనేనని. నన్ను నేనే ఆపుకున్నాను. కానీ ఏ క్షణాన్నైతే బాధ్యతలు తీసుకోవడం మొదలుపెట్టానో అప్పుడు నాలో ఏదో తెలీని శక్తి కలిగింది.’


‘నా మనసును ఎప్పుడైతే అర్థం చేసుకోవడం మొదలుపెట్టానో అవి చెప్పేగుసగుసలు వినడం మొదలుపెట్టాను. నాలో ఉన్న ప్రతిభను ఫీలయ్యాను. ఆ క్షణమే నా జీవితంలో మారిపోయింది. ప్రతి మనిషికి జీవితంలో ఏదో ఒక ప్రయోజనం ఉంటుందని తెలిసింది. అదేంటో తెలియాలంటే మనిషిలో ప్రతిభ ఉండాలి. నాలో ఆ ప్రతిభ ఉందని గుర్తించాను. నా మనసును ఆచరించాను. చాలా సంతోషంగా ఉంది. విజయవంతమయ్యాను. ప్రయాణం ముఖ్యం. గమ్యం కాదు.’ అని చెప్పుకొచ్చారు మంజుల.


పుట్టిన రోజు నాడు స్వీట్ మెస్సేజ్ ఇచ్చిన మంజుల 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com