ఈ రోజుల్లో లిప్‌లాక్ సీన్లు చాలా కామన్. ఒక్కో సినిమాలో ఒకటీ రెండు కాదు.. డజన్ల కొద్దీ అదర చుంభనాలు ఉంటున్నాయి. పెద్ద హీరోలు, చిన్న హీరోలు అన్న తేడా కూడా పెద్దగా లేదు. ఇక బాలీవుడ్ లో అయితే లిప్ లాక్ సీన్లు పరమ రొటీన్ అయిపోయాయి. అయితే ఇలాంటి రొటీన్ కంతటికీ దూరదూరంగా ఉంటున్నాడు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్. తన సినిమాల్లో మూతి ముద్దులకు అస్సలు స్థానం ఇవ్వడు సల్మాన్.
ఈ హీరో తన తాజా సినిమా విషయంలో కూడా అదే రూల్ కే కట్టుబడ్డాడు అని సమాచారం. త్వరలోనే విడుదల కాబోతున్న ‘టైగర్ జిందా హై’ సినిమా గురించిన ఖబర్ ఇది. ఈ సినిమా యాక్షన్ థ్రిల్లరే అయినా.. ఇందులో రొమాన్స్ కు కూడా స్కోప్ ఉంది. కత్రినా వంటి హీరోయిన్ ను పెట్టారు ఈ సినిమాలో. హీరోతో ఆమెకు రొమాంటిక్ సన్నివేశాలున్నాయని ట్రైలర్ తో నే స్పష్టం అవుతోంది.
మరి అలాంటి సన్నివేశాల్లో.. సల్మాన్, కత్రినాల మధ్య అదర చుంభనాన్ని ప్లాన్ చేశాడట దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్. అయితే సల్లూ మాత్రం ‘నో’చెప్పాడట. తను లిప్‌లాక్ సన్నివేశాల్లో నటించను అని స్పష్టం చేశాడట. ఇది వరకూ చాలా సినిమాల్లో పెదవుల ముద్దులను ఇచ్చిన కత్రినా సల్మాన్ తో కూడా కిస్సుకు సై అన్నా.. సల్లూ మాత్రం స్ట్రిక్ట్ గా నో చెప్పాడట. తను అలాంటి సన్నివేశాల్లో నటించను అని తేల్చి చెప్పాడట. దీంతో దర్శకుడు కూడా చేయగలిగింది ఏమీ లేకపోయిందని సమాచారం.