ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డేట్స్ ఖాళీ లేవని చెప్పి తప్పుకున్న తమన్నా

cinema |  Suryaa Desk  | Published : Wed, Nov 08, 2017, 03:31 PM



తేజ దర్శకత్వంలో వెంకటేశ్ ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కే ఈ సినిమాకి 'ఆటా నాదే వేటా నాదే' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. దాదాపు ఇదే టైటిల్ ఖరారైపోయే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఈ సినిమాలో కథానాయికగా తమన్నాను అడిగారట. అయితే డేట్స్ ఖాళీ లేవని చెప్పినట్టు సమాచారం.


ప్రస్తుతం తమన్నా మరీ అంత బిజీగా ఏంలేదు. ఈ సినిమా చేయడం ఇష్టం లేకనే ఆమె అలా చెప్పిందనే టాక్ వినిపిస్తోంది. దాంతో 'నేనే రాజు నేనే మంత్రి' సక్సెస్ ను దృష్టిలో పెట్టుకుని కాజల్ తప్పకుండా చేస్తుందనే ఉద్దేశంతో ఆమెను అడిగారట. అయితే ఆమె భారీ పారితోషికం డిమాండ్ చేసినట్టు వినికిడి. కాజల్ కూడా ఈ ప్రాజెక్టు చేయడం ఇష్టం లేకనే పారితోషికం భారీగా అడిగిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హీరోయిన్ విషయంలో ఈ సినిమా టీమ్ ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి మరి.       






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com