ట్రెండింగ్
Epaper    English    தமிழ்

షాకిస్తున్న ట‌బు రెమ్యూన‌రేష‌న్‌

cinema |  Suryaa Desk  | Published : Sun, Jul 14, 2019, 06:05 PM



వెంకటేష్ కూలి నెంబర్ 1 సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన టబు నిన్నే పెళ్లాడుతా సినిమాతో మంచి హిట్ కొట్టింది. ఆ తరువాత నాగ్ తోను, చిరంజీవితోనూ సినిమాలు చేసింది. బాలయ్యతో పాండురంగడు సినిమాలో నటించింది. తెలుగులో చేసింది కొన్ని సినిమాలే. బాలీవుడ్ లో అనేక సినిమాల్లో నటిస్తూ బిజీ అయ్యింది. రీసెంట్ గా దే దే ప్యార్ దే సినిమాలో నటించి మెప్పించింది. ఈ సినిమా సూపర్ హిట్ కొట్టింది. ఇప్పుడు ఈ హీరోయిన్ తెలుగులోకి రీ ఎంట్రీ ఇచ్చింది. త్రివిక్రమ్.. అల్లు అర్జున్ కాంబినేషన్లో వస్తున్న కొత్త సినిమాలో టబు ను ఓ కీలక పాత్ర కోసం తీసుకున్నారు. ఈ పాత్ర కోసం టబు భారీగా డిమాండ్ చేసిందట. పాత్ర కీలకం కావడంతో ఆమె అడిగినంత ఇచ్చేందుకు రెడీ అయ్యారట. అల్లు అర్జున్ సినిమాకు ఆమె ఏకంగా 60 లక్షల రూపాయలు తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇది పెద్దమొత్తం అనే చెప్పాలి. ఓ క్యారెక్టర్ కు ఈ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకోవడం అంటే గొప్ప విషయమే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com