ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆండ్రియా దగ్గర ఎంత పైత్యం ప్రదర్శించాడో

cinema |  Suryaa Desk  | Published : Thu, Nov 09, 2017, 02:38 PM



హీరోకి.. హీరోయిన్కి తేడా ఏంది? అంటే.. చిట్టా భారీగా చెప్పుకొస్తారు. సినిమాకు హీరో ఎంత ముఖ్యమో హీరోయిన్ అంతే కీలకం. హీరో ఎన్ని ఫైట్లు.. మరెంత యాక్షన్ ప్రదర్శించినా.. హీరోయిన్ పక్కన లేకుండా ఆ లోటు లోటే. కానీ.. హీరోకి ఇచ్చినంత ప్రాధాన్యత.. హీరోయిన్ కి దక్కదు. తెర మీదనే కాదు.. తెర వెనుక కూడా హీరోయిన్లకు ఇచ్చే గౌరవ మర్యాదల విషయంలో చాలానే విమర్శలు ఆరోపణలు ఉన్నాయి.


హీరోయిన్ల పట్ల అనుచితంగా వ్యవహరించటం.. వెకిలి చేష్టలతో వారిని ఇబ్బంది పెట్టటం లాంటివి కనిపిస్తుంటాయి. వీటిని ఒక పట్టాన భరిస్తుంటారు. కొన్నిసార్లు మాత్రం తట్టుకోలేక బరస్ట్ అవుతుంటారు.  అందంగా ఉండటమే శాపమా? గ్లామర్ గా కనిపిస్తే చెలరేగిపోవాలా?  లాంటి కొన్ని ప్రశ్నలు తెర మీదకు వస్తుంటాయి. ఇక.. హీరో.. హీరోయిన్ల మధ్య ఉండే రెమ్యునరేషన్ గ్యాప్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు.


హీరోయిన్లను లైంగికంగా ఓ వస్తువుగా చూస్తారనే ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నవే. గతంలో తమకు ఎదురైన చేదు అనుభవాల్ని గుండెల్లో దాచుకొని బాధ పడేవారు. ఇప్పుడు మాత్రం ధర్మాగ్రహాన్ని ప్రదర్శించి వారి దుర్మార్గాల్ని బయటపెడుతున్నారు.తాజాగా నటి ఆండ్రియా ముచ్చటే చూద్దాం. తెర మీద గ్లామర్ పండించే ఆమెను ఇంటర్వ్యూ చేసే క్రమంలో ఇంటర్య్వూ చేసే వ్యక్తి ప్రదర్శించిన పైత్యం.. అతగాడి సొల్లు తీరు ఇప్పుడు కొత్త చర్చకు తెర తీసింది. సినిమా విడుదల సందర్భంగా ఇచ్చే ఇంటర్వ్యూలతో పాటు.. కొన్నిసార్లు ప్రత్యేక ఇంటర్వ్యూలను ప్లాన్ చేస్తుంటారు. తాజాగా అలాంటి ఇంటర్వ్యూ ఒకటి ఆండ్రియా ఇచ్చింది. ఇంటర్వ్యూ మొదలైందో లేదో.. ఆమె అంటే తనకెంత పిచ్చో చెప్పుకొచ్చాడు ఇంటర్వ్యూ చేసే వ్యక్తి. 


సగటు అభిమాని ప్రదర్శించే అతృతను అతగాడు ప్రదర్శించేశాడు. అక్కడితో ఆగని అతడు.. ఆమె నటించిన పచైకిలి ముత్తుచారం మూవీలో ఆమె నటకు ఫిదా అయినట్లు చెప్పటం చూస్తే.. నటి పట్ల ఉన్న చులకన భావం అర్థమవుతుంది.ఎందుకంటే.. పచైకిలి ముత్తుచారం సినిమా చూస్తే.. భయంకరమైన జబ్బు ఉన్న కొడుక్కి తల్లిగా ఆండ్రియా నటించింది. కొడుకు వైద్యం కోసం అవసరమైన డబ్బు కోసం మరో వ్యక్తిని లైంగికంగా లోబరుచుకొని.. ఆ భార్యభర్తలను డబ్బు కోసం వేధించే మహిళగా ఆండ్రియా నటించింది. సినిమా ఆ పార్ట్ నచ్చిందని చెప్పటం ద్వారా అతగాడి పైత్యం ఏమిటో అర్థమవుతుంది. నిజానికి ఈ సినిమాలో గ్లామర్ ఒలకబోయటం తప్పించి ఆండ్రియా నటించింది లేదు. అయినా.. ఇంటర్వ్యూయర్ మాత్రం ఆమెను ఎందుకు పొగిడారో అర్థమవుతుంది. ఇంత సొల్లును భరిస్తూ.. అతగాడికి చిరునవ్వుతో సమాధానాన్ని ఇచ్చింది ఆండ్రియా. హీరోయిన్ కనిపించగానే ఇంతలా మాట్లాడుతున్న తీరు చూస్తే.. ఎక్కడికి పోతున్నామన్నది ఓ పట్టాన అర్థంకాదనే చెప్పాలి. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com