టాలీవుడ్ బ్యుూటీ సమంత గతనెలలో అక్కినేని నాగచైతన్యను వివాహమాడిన సంగతి తెలిసిందే. ఈ పెళ్లి గురించి ముందే క్లారిటీ ఉన్న దర్శక నిర్మాతలు.. ఆమెకు ఆఫర్స్ ఇవ్వడంలో ఆచితూచి వ్యవహరించారు. ప్రస్తుతం సమంత చేతిలో రంగస్థలం మినహాయిస్తే మరో పెద్ద సినిమా ఏదీ లేదు.
మరో రెండు మూడేళ్లు నటిస్తానని.. పెళ్లి తర్వాత కూడా సినిమాలు కంటిన్యూ చేస్తానని చెప్పిన సమంత.. అదే రూట్ లో ఉంది కానీ.. పెళ్లయిన భామను జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారనే సంగతి.. రంగస్థలం రిలీజ్ అయ్యాక గానీ తెలీదు. దీంతో ఇప్పుడు ఆఫర్స్ అన్నీ టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ కు అందుతుండడం విశేషం. స్టార్ స్టేటస్ కు దగ్గరగా వెళ్లిన రకుల్ ప్రీత్ సింగ్.. స్పైడర్ దెబ్బతో ఫ్లాప్ హీరోయిన్ స్టాంప్ వేయించుకుంది. ఇదే టైంలో సీనియర్ అయిన కాజల్ అగర్వాల్ మాత్రం ఖైదీ నంబర్ 150 అంటూ మెగాస్టార్ తోను.. నేనేరాజు నేనే మంత్రి అంటూ రానాతోను సక్సెస్ లు అందుకుని ఫాంలోకి వచ్చేసింది.
మధ్యలో కాస్త నెమ్మదించినా.. కాజల్ కు ఇప్పటికీ జనాల్లో ఫుల్ క్రేజ్ ఉండడంతో ఈమెకు ఆఫర్స్ ఇచ్చేందుకు నిర్మాతలు ఉత్సాహం చూపుతున్నారు. ప్రస్తుతం వెంకటేష్ తో ఓ సినిమా ఒప్పుకున్న కాజల్.. మరోవైపు శర్వానంద్ తోను ఓ మూవీకి సైన్ చేసింది. అటు సీనియర్లు.. ఇటు యంగ్ హీరోలను కవర్ చేసేస్తూ.. తన స్టైల్ చూపిస్తున్న కాజల్.. సమంత పెళ్లిని బాగానే క్యాష్ చేసుకుంటోందనే టాక్ వినిపిస్తోంది.