త్వరలో 'డియర్ కామ్రేడ్' నాలుగు భాషల్లో విడుదల కానున్నవిషయం విదితమే. ఈ చిత్ర ప్రమోషన్స్‌ని మ్యూజిక్ ఫెస్టివల్ పేరుతో పలు నగరాలలో ఘనంగా నిర్వహిస్తున్నారు చిత్ర నిర్మాతలు స్వయంగా విజయ్ దేవరకొండ, రష్మికా ఈ ఈవెంట్స్‌లో పాల్గొని ఫ్యాన్స్‌ని ఎంటర్టైన్ చేస్తునే సినిమా గురించి ప్రమోట్ చేసారు. ఈ మధ్య హైద్రాబాద్‌లో జరిగిన మ్యూజిక్ ఫెస్టివల్ కి హాజరైన కథానాయిక రష్మికా స్టేజ్‌పై డాన్సులు ఇరగదీసేసింది. లైవ్ షోలో ఓ రేంజ్లో రష్మికా రెచ్చిపోయి డాన్సులేయడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. రష్మికా కమిట్మెంట్కి హ్యాట్సాఫ్ అనాల్సిందే, ఏదో సరదాగా డాన్స్ హమ్ చేసినట్లుగా కాకుండా, ప్రొఫిషనల్ డాన్సర్లా పర్ఫామ్ చేసింది. ఇంతవరకూ రష్మికాలోని డాన్స్ టాలెంట్‌ని ఈ స్థాయిలో చూడలేదంటూ ప్రశంసలు కురుస్తున్నాయి.