ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మిడిల్‌ క్లాస్‌ అబ్బాయి టీజర్‌ విడుదల

cinema |  Suryaa Desk  | Published : Fri, Nov 10, 2017, 10:42 AM



నేచురల్‌ స్టార్‌ నాని కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘ఎంసీఏ’ (మిడిల్‌ క్లాస్‌ అబ్బాయి). ఈచిత్రంలో నానికి జోడీగా సాయి పల్లవి నటిస్తోంది. ఈ సినిమా టీజర్‌ ఈ రోజు విడుదలైంది. దీపావళి సందర్భంగా చిత్రం ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఫస్ట్‌లుక్‌లో ఒక చేత్తో లుంగీ పట్టుకుని మరో చేత్తో పాల ప్యాకెట్లు పట్టుకుని టైటిల్‌కి తగ్గట్టుగానే ‘మిడిల్‌ క్లాస్‌ అబ్బాయి’గా కన్పించిన నాని.. టీజర్‌లో అసలు ఎంసీఏ అన్న పదానికి అసలు అర్థమేంటో చెప్పారు.


టీజర్‌లో.. అసలు ఎంసీఏ అంటే ఏంటి అదేమన్నా క్వాలిఫికేషనా అని ఓ వ్యక్తి నానిని అడుగుతాడు. ఇందుకు నాని ‘కాదు మైండ్‌సెట్‌. ఎప్పుడైనా షర్ట్‌ బటన్‌ వూడిపోతే పిన్నీస్‌ పెట్టుకుని మ్యానేజ్‌ చేశావా? మామూలు జీన్స్‌ని బ్లేడ్‌తో కట్‌ చేసి టోర్న్‌ జీన్స్‌లా కలర్‌ ఇచ్చావా? అంతెందుకు ఎప్పుడైనా అలా రోడ్డుపై వెళుతూ బస్‌స్టాప్‌లో ఓ అందమైన అమ్మాయిని చూసి ఇద్దరు ముగ్గురు పిల్లలతో ఓ ఫ్యామిలీ ఫొటోను వూహించుకున్నావా? ఇవన్నీ చేసుంటే తెలిసేది ఎంసీఏ అంటే ‘మిడిల్‌ క్లాస్‌ అబ్బాయని’ అంటూ నాని చెప్తున్న డైలాగ్‌ ఆకట్టుకుంటోంది. కథానాయిక సాయి పల్లవి ‘నువ్వు నాకు నచ్చావ్‌. ఎప్పుడు పెళ్లిచేసుకుంటావ్‌’ అని నానిని డైరెక్ట్‌గా అడగటం టీజర్‌లో హైలైట్‌గా నిలిచింది.వేణు శ్రీరామ్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్‌ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. డిసెంబర్‌లో ఈ చిత్రం విడుదల కాబోతోంది. త్వరలో నాని, అక్కినేని నాగార్జున కాంబినేషన్‌లో ఓ మల్టీస్టారర్‌ చిత్రం కూడా రాబోతోంది.






 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com