బాలీవుడ్ నటి సోనాక్షిసిన్హా చిత్ర పరిశ్రమకు వచ్చి తొమ్మిదేళ్లు కావొస్తున్నా ప్రేమ, జీవితం గురించి మీడియా ఎదుట అంతగా మాట్లాడలేదు. ఆమె తాజాగా ఓ ఛాట్ షోలో పాల్గొంది. ఈ సందర్భంగా ‘చిత్ర పరిశ్రమకి సంబంధించిన వారితో డేటింగ్‌పై మీ అభిప్రాయం ఏంటి’ అని ప్రశ్నించారు. దీనికి ఆమె స్పందిస్తూ.. ‘నేను మంచి కుర్రాడిని ప్రేమించాలనేది నా తల్లిదండ్రుల కోరిక. కానీ చిత్ర పరిశ్రమలో అలాంటి వారు లేరు. గతంలో నేను ఇండస్ట్రీకి చెందిన ఓ సెలబ్రిటీతో డేటింగ్ చేశా. కానీ ఈ ప్రపంచం దాన్ని కనిపెట్టలేకపోయింది.