ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సాగ‌ర‌క‌న్య గెట‌ప్‌లో స‌న్నీలియోన్

cinema |  Suryaa Desk  | Published : Sun, Jul 21, 2019, 08:20 PM



దర్శకేంద్రుడు కే. రాఘ‌వేంద్ర‌రావు డైరక్షన్ లో వచ్చి వెండితెరపై సంచనలం సృష్టించిన సాహ‌సవీరుడు సాగ‌ర‌క‌న్య మూవీ మ‌నంద‌రికి గుర్తుండే ఉంటుంది. ఇందులో సాగ‌ర‌క‌న్య‌గా శిల్పాశెట్టి  గెట‌ప్ ఇప్ప‌టికి ప్రేక్ష‌కుల మ‌దిలో మెదులుతూనే ఉంది. అయితే ఇప్పుడు బాలీవుడ్ హాట్ బాంబ్ స‌న్నీలియోన్ కూడా సాగ‌ర‌క‌న్య గెట‌ప్‌లోకి మారి అందరిని ఆశ్చర్చపర్చింది. మత్స్యకన్య గెట‌ప్‌లోకి మారి ఫోటో షూట్ చేసిన ఈ అమ్మ‌డు ఆ ఫోటోలని సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. ఎప్పుడు హాట్ హాట్‌గా క‌నిపించే స‌న్నీలియోన్ ఒక్క‌సారిగా సాగ‌ర‌క‌న్య అవ‌తారంలోకి వ‌చ్చే స‌రికి అభిమానులు ఆశ్చ‌ర్య‌పోతున్నారు. ఈ ఫోటోల‌పై నెటిజన్లు భిన్నరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. స‌న్నీ సూపర్ అంటూ కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. శిల్పాశెట్టి కన్నా సన్నీలియోన్ సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సన్నీ ప్రస్తుతం  రూ.150 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న వీర‌మాదేవి మూవీలో లీడ్ రోల్ లో నటిస్తున్న విషయం తెలిసిందే.  సౌత్ ఇండియన్ కల్చర్స్ బ్యాక్ డ్రాప్ తో చారిత్రాత్మక యుద్ధ నేపథ్యంలో ఈ మూవీ తెర‌కెక్కుతుంది. తెలుగు, తమిళం, హిందీతో పాటు ప‌లు భాషల్లో రూపొందనున్న ఈమూవీని వి.సి.వడివుడయన్ తెరకెక్కించనుండగా, స్టీవ్స్ కార్నర్ పతాకంపై పోన్స్ స్టిఫెన్  నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com