గ్లోబల్ స్టార్ ప్రియాంకా చోప్రా తన జన్మదినోత్సవం సందర్భంగా మియామీలో చేసిన హంగామా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భర్త నిక్ జోనాస్‌తో కలిసి ప్రియాంక స్మోకింగ్ చేస్తున్న ఫోటోలు నెట్లో దర్శనమిచ్చిన సంగతి తెలిసిందే. గతంలో నీతులు చెప్పి ఇప్పుడిలా చేయడంతో నెటిజన్లు ఆమెను ట్రోలింగ్ చేస్తున్నారు. ఇక, తాజాగా ప్రియాంక బికినీ ఫోటోలు కూడా వైరల్‌గా మారాయి.పింక్ బికినీ ధరించి భర్త నిక్‌తో కలిసి ప్రియాంక సముద్రంపై జెట్ స్కీ రైడ్ చేసింది. అలాగే సముద్రంలో ఈత కొట్టి స్కీయింగ్ కూడా చేసింది. ప్రియాంక 37వ జన్మదినోత్సవం సందర్భంగా ఆమె తల్లి మధు చోప్రా, కజిన్ పరిణీతి చోప్రా కూడా మియామీలో సందడి చేశారు.