ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెళ్లి వార్తలపై స్పందించిన నటి

cinema |  Suryaa Desk  | Published : Fri, Nov 10, 2017, 02:51 PM



బాలీవుడ్‌ నటి సోనమ్‌కపూర్‌.. దిల్లీకి చెందిన వ్యాపారవేత్త ఆనంద్‌ ఆహూజా కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయాన్ని ఇద్దరూ పరోక్షంగా చెప్పకనే చెప్పారు. సోనమ్‌..ఆనంద్‌తో కలిసి దాదాపు నెలరోజుల పాటు అమెరికాలో విహారయాత్రలో ఉండి వచ్చింది.


ఎప్పటికప్పుడు ఆనంద్‌తో కలిసి దిగిన ఫొటోలూ పోస్ట్‌ చేస్తూనే ఉంది. అయితే వీరి ప్రేమకు ఇంట్లో వారు కూడా పచ్చజెండా వూపడంతో 2018లో నిశ్చితార్థం పెట్టుకోనున్నట్లు బాలీవుడ్‌ వర్గాల సమాచారం. తాజాగా ఈ వార్తలపై సోనమ్‌ స్పందించింది. ఇప్పటికైతే కేవలం పనితోనే బిజీగా ఉన్నానని తెలిపింది. దీన్ని బట్టి ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశంలో సోనమ్‌ లేదని తెలుస్తోంది.


ప్రస్తుతం సోనమ్‌ ‘వీరే ది వెడ్డింగ్‌’ చిత్రంలో నటిస్తోంది. ఇందులో కరీనా కపూర్‌, స్వరా భాస్కర్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల ఈచిత్ర ఫస్ట్‌లుక్‌ విడుదలైంది. 2018 మే 18న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com