ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఒక్క‌డు మిగిలాడు మూవీ రివ్యూ

cinema |  Suryaa Desk  | Published : Fri, Nov 10, 2017, 03:13 PM



క‌థ: యూనివ‌ర్సిటీ ప్రొఫెస‌ర్(సూర్య‌) త‌న ప్ర‌మోష‌న్ కోసం త‌న ముగ్గురు కాలేజ్ స్టూడెంట్స్‌ను మినిష్ట‌ర్ కొడుకులకు అప్ప‌గిస్తాడు. మినిష్ట‌ర్ (మిలింద్ గునాజి) కొడుకులు ఆ అమ్మాయిల‌ను చంపేస్తారు. చ‌నిపోయింది యూనివ‌ర్సిటీ అమ్మాయిలే కాకుండా శ‌ర‌ణార్థులు కూడా కావ‌డంతో స్టూడెంట్స్ అంద‌రూ ఏక‌మ‌వుతారు. విద్యార్థి నాయ‌కుడు సూర్య‌(మ‌నోజ్‌) ఆధ్వ‌ర్యంలో మినిష్ట‌ర్‌కు వ్య‌తిరేకంగా పోరాటం సాగిస్తారు. మినిష్ట‌ర్ త‌న ప‌లుకుబ‌డిని ఉప‌యోగించి సూర్య‌ను ఆరెస్ట్ చేయిస్తాడు. త‌న‌ను చంప‌డానికి ప్ర‌య‌త్నాలు చేస్తుంటాడు. ఆస‌మ‌యంలో సూర్య ఉండే పోలీస్ స్టేష‌న్‌కు వ‌చ్చిన కొత్త కానిస్టేబుల్ శివాజీ(పోసాని కృష్ణ‌ముర‌ళి)..సూర్య‌కు స‌హాయం చేయాల‌నుకుని త‌న గురించి తెలుసుకునే ప్ర‌య‌త్నం చేస్తాడు. అస‌లు సూర్య ఎక్క‌డి నుండి వ‌చ్చాడు అనే పాయింట్‌తో అస‌లు క‌థ మొద‌ల‌వుతుంది. సూర్య ఎవ‌రు? సూర్య‌, పీట‌ర్‌కు సంబంధం ఏమిటి? విక్ట‌ర్ ఎవ‌రు? విక్ట‌ర్‌, సూర్యకు సంబంధం ఏమిటి? అనే విష‌యాల‌ను తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.


విశ్లేష‌ణ  : శ్రీలంక‌లోని త‌మిళుల కోసం పోరాడే నాయ‌కుడు పీట‌ర్‌గా, విద్యార్థి నాయ‌కుడు సూర్య‌గా రెండు పాత్ర‌ల‌ను మంచు మ‌నోజ్ చ‌క్క‌గా చేశాడు. పీట‌ర్ పాత్ర హై ఇన్‌టెన్స‌న‌ల్, ఎమోష‌న‌ల్‌గాసాగితే, సూర్య పాత్ర సెటిల్డ్‌గా సాగుతుంది. రెండు పాత్ర‌ల్లో మ‌నోజ్ చ‌క్క‌టి వేరియేష‌న్‌ను చూపించాడు. పీట‌ర్ పాత్ర కోసం మ‌నోజ్ బ‌రువు పెరిగాడు. అలాగే సూర్య పాత్ర కోసం మ‌ళ్లీ బ‌రువు త‌గ్గాడు. ఆహార్యం, హావ‌భావాల్లో కూడా చ‌క్క‌టి వేరియేష‌న్‌ను చూపాడు మ‌నోజ్‌. ఇక సినిమాలో చెప్పుకోద‌గ్గ మ‌రో పాత్ర విక్ట‌ర్‌గా న‌టించిన ద‌ర్శ‌కుడు అజ‌య్ అండ్రూస్‌ది. సినిమాలో చాలా కీల‌క‌మైన పాత్ర‌. సెకండాఫ్ అంతా విక్ట‌ర్ పాత్ర‌పైనే సినిమా ఎక్క‌వ శాతం సాగుతుంది. ఇక అనీషా అంబ్రోస్ జ‌ర్న‌లిస్ట్ స్వ‌ర్ణ పాత్ర‌లో క‌నిపిస్తుంది. త‌న పాత్ర‌కు పెద్ద‌గా ప్రాధాన్య‌త క‌న‌ప‌డ‌దు. మినిష్ట‌ర్‌గా మిలింద్ గునాజీ, ప్రొఫెస‌ర్‌గా న‌టించిన సూర్య. సీఎం పాత్ర‌లో ముర‌ళీ మోహ‌న్‌, హెల్త్ మినిష్ట‌ర్ పాత్ర‌లో సుహాసిని ఇలా అంద‌రూ వారి వారి పాత్ర‌ల‌కు న్యాయం చేశారు. ద‌ర్శ‌కుడు అజ‌య్ శ్రీలంక ప్ర‌భుత్వానికి, అక్క‌డి త‌మిళుల‌కు పోరాటం జ‌రిగిన‌ప్పుడు అమాయ‌క‌మైన ప్ర‌జ‌లు ఎలాంటి ఇబ్బంద‌లు ప‌డ్డారు. కొంద‌రు ఇండియా వ‌చ్చేయ‌డానికి ఎలాంటి ప‌రిస్థితుల‌ను ఎదుర్కొన్నారనే దానిపై బాగా రీసెర్చ్ చేసి దాని ఆధారంగా క‌థ‌ను త‌యారు చేసుకుని, ఇప్ప‌టి విద్యార్థి నాయ‌కుడు సూర్య అనే పాత్ర‌కు లింక్ పెడుతూ చ‌క్క‌గా తెర‌కెక్కించాడు.


 ముఖ్యంగా సెకండాఫ్‌లో స‌ముద్రంలో వ‌చ్చే బోట్ రైడింగ్ సీన్‌, దానిలోఎమోష‌న్స్ అన్నీ ప్రేక్ష‌కుల హృద‌యాన్ని ట‌చ్ చేస్తాయి. శివ నందిగామ మంచి బ్యాగ్రౌండ్ స్కోర్‌ను అందించారు. కోదండ‌రామ‌రాజు సినిమాటోగ్ర‌ఫీ ఎఫెక్టివ్‌గా లేదు. చాలా సీన్స్‌కు డిఐ చేసిన‌ట్లు అనిపించ‌లేదు. విద్యార్థి నాయ‌కుడి పాత్ర‌కు త‌గ్గ ఎలివేష‌న్ క‌న‌ప‌డ‌దు. ద‌ర్శ‌కుడు ఏదో అవేద‌న‌ను చెప్పాల‌నుకున్నాడని అర్థ‌మైంది కానీ..ప్రేక్ష‌కుల‌కు న‌చ్చుతుందా అని చెప్ప‌లేం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com