ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'గుణ 369' నుండి మంచి మెలోడీ సాంగ్ విడుదల

cinema |  Suryaa Desk  | Published : Tue, Jul 23, 2019, 02:54 PM



అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో కార్తికేయ కథానాయకుడిగా 'గుణ 369' రూపొందుతోంది. 'అనఘ' కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా నుంచి, తాజాగా ఒక లిరికల్ వీడియో సాంగును రిలీజ్ చేశారు.


"మనసుకిది గరళం .. గరళం, సెకనుకొక మరణం .. మరణం" అంటూ ఈ పాట సాగుతోంది. 'దిశ తెలియదే .. నిశి చెరగదే' .. 'మొదటి పుటలోనే తడబడి వలపు కథ విలపిస్తున్నది' వంటి పద ప్రయోగాలు బాగున్నాయి. ఈ మధ్య కాలంలో వచ్చిన మంచి మెలోడీ సాంగ్స్ లో ఇది ఒకటిగా చేరిపోతుంది. చైతన్ భరద్వాజ్ సంగీతం .. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం .. విజయ్ యేసుదాస్ - శ్వేతా మోహన్ ఆలాపనతో ఈ పాట యూత్ కి అనుభూతి పరిమళాన్ని అందించేదిగా వుంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com