నేచురల్ స్టార్ నాని వెర్సటైల్ డైరెక్టర్ విక్రమ్ కె.కుమార్ కాంబినేషన్లో మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, మోహన్(సివిఎం) నిర్మిస్తున్న విభిన్న చిత్రం 'నాని'స్ గ్యాంగ్ లీడర్'. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను జూలై 24న ఉదయం 11 గంటలకు విడుదల చేయబోతున్నారు. ఇటీవల విడుదల చేసిన ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. అలాగే 'రారా.. జగతిని జయించుదాం...' అంటూ సాగే ఈ సినిమా ఫస్ట్ సాంగ్‌కి కూడా అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ అందించిన మ్యూజిక్ మెస్మరైజింగ్‌గా ఉంది. నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ఒక ప్రధాన పాత్ర 'ఆర్ఎక్స్ 100' ఫేమ్ కార్తికేయ పోషిస్తున్నారు.