ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నమిత పెళ్ళి డేట్ చెప్పేసింది

cinema |  Suryaa Desk  | Published : Fri, Nov 10, 2017, 03:51 PM



తమిళ నటుడు వీరా (వీరేంద్ర చౌదరీ) తో ఈనెల 24న తన వివాహం జరగనుందని నమిత స్వయంగా చెప్పింది. తమిళ బిగ్ బాస్ ప్రోగ్రాం కంటెస్టెంట్లు రజియా విల్సన్ మరికొందరు కలిసి సోషల్ మీడియాలో ఓ సూపర్ గుడ్ న్యూస్ చెప్పబోతున్నామంటూ వీడియో మెసేజ్ ద్వారా అభిమానులందరికీ నమిత పెళ్లి సంగతి తెలియజేశారు.అదే వీడియోలో తన బాయ్ ఫ్రెండ్.. ఉడ్ బీతో కలిసి కనిపించిన నమిత తన సొట్టబుగ్గల నవ్వులతో ఆనందంగా మాట్లాడింది. నవంబర్ 24న వీరాతో తన పెళ్లి జరగనుందని.. మీ అందరి ప్రేమాభిమానాలు తనకెప్పుడూ ఉండాలని కోరుకుంది.


నమిత పెళ్లి చేసుకోబోతున్న వీరా తమిళంలో చిన్నాచితకా పాత్రలు చేస్తుంటాడు. వీళ్లిద్దరూ కలిసి మియా అనే థ్రిల్లర్ ఫిలింలో నటించారు.నమిత పరిచయమైంది.. పేరు తెచ్చుకుంది తెలుగు తెరపైనే అయినా ఇక్కడ ఆమెకు చెప్పుకోదగిన అవకాశాలు ఒకట్రెండు మాత్రమే వచ్చాయి. భారీ అందాలకు పెద్దపీట వేసే కోలీవుడ్ వెల్ కం చెప్పడంతో పెట్టెబేడా సర్దుకుని చెన్నైకి షిఫ్టయిపోయింది. చివరకు తమిళనాడులోనే తన లైఫ్ పార్టనర్ ను వెతుక్కుని అక్కడే సెటిలయిపోతోంది.ఇక వీరా కూడా త‌న అఫీషియ‌ల్ పేజ్‌లో న‌మిత‌ని వివాహం చేసుకోబోతున్న‌ట్టు తెలిపాడు. వీరా, న‌మిత క‌లిసి మియా అనే థ్రిల్ల‌ర్ ఫిలింలో క‌లిసి న‌టించారు. క్రింద కనిపిస్తున్న వీడియోలో న‌మిత ప్ర‌క్క‌న నించున్న వ్య‌క్తే వీరా. మొత్తానికి ఇన్నాళ్ళకి చాలా రూమర్లకి తెర దించేస్తూ తమిళ అమ్మాయిగా సెట్ అయిపోతోందన్నమాట ఈ గుజరాతీ భామ.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com