ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అనుష్క కోసం ప్రభాస్ ఏకంగా బీఎం డబ్ల్యూ కారును

cinema |  Suryaa Desk  | Published : Sat, Nov 11, 2017, 11:39 AM



స్టార్ నటీనటులకు సినిమా తీసిన సంతృప్తి ఏ స్థాయిలో ఉంటుందో గాని రూమర్స్ మాత్రం చాలా అసంతృప్తిని ఇస్తాయనే చెప్పాలి. ఒక్కోసారి స్టార్స్ ఇలాంటి రూమర్స్ పై స్పందించకపోయినా ఇక అందరు నిజమేమో అని నమ్మేస్తున్నారు. దీంతో మ్యాటర్ పెద్దగా అయ్యే సరికి తలలు పట్టుకోవాల్సి వస్తోంది. ఇక అసలు విషయానికి వస్తే బాహుబలి సినిమా మొదలు పెట్టినప్పటి నుండి ప్రభాస్ - అనుష్క ల మధ్య ప్రేమ వ్యవహారం గట్టిగా నడుస్తోందని రూమర్స్ ఏ స్థాయిలో వచ్చాయో అందరికి తెలిసిందే. 


అయితే అది అబద్దమని ప్రభాస్ చాలా సార్లు చెప్పాడు. ఇక అనుష్క అయితే రూమర్ వినగానే చాలా బాధపడిందని న్యూస్ లు కూడా బాగానే వచ్చాయి. అయితే వారిద్దరూ మాత్రం మంచి స్నేహితుల్లా ఉండడానికి ఇష్టపడతారని సినీ వర్గాల్లో టాక్ ఉంది. కానీ గత నెలలో ప్రభాస్ పుట్టిన రోజు సందర్బంగా అనుష్క ప్రభాస్ కి లేటెస్ట్ ట్రెండీ వాచ్ లంటే చాలా ఇష్టమని ఒక రిస్ట్ వాచ్ ను కానుకగా ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో దానిపైనే కూడా రూమర్స్ చాలానే వచ్చాయి. ఇక రీసెంట్ గా నవంబర్ 7న అనుష్క పుట్టినరోజు సందర్బంగా బాహుబలి కూడా దేవసేనకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చాడని కథనాలు వస్తున్నాయి. 


 


అనుష్క కోసం ప్రభాస్ ఏకంగా బీఎం డబ్ల్యూ కారును కానుకగా ఇచ్చాడని టాక్ వినిపిస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమనేది ఇంకా తెలియరాలేదు కానీ అనుష్క కోసం మాత్రం ప్రభాస్ ఓ మంచి గిఫ్ట్ ఇచ్చాడని తెలుస్తోంది. అయితే ఈ రూమర్స్ పై ఇప్పటివరకు ప్రభాస్ అనుష్క ఏ వివరణ ఇవ్వలేదు. దీంతో సోషల్ మీడియాలో కూడా ఈ న్యూస్ చర్చనీయాంశంగా మారింది.  






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com