హైదరాబాద్: పద్మావతి ఫిల్మ్‌కు సంబంధించిన రెండవ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఏక్ దిల్ ఏక్ జాన్ సాంగ్ ప్రేక్షకులను కట్టిపడేస్తున్నది. ఫస్ట్ సాంగ్ ఘూమర్ ఇప్పటికే హిట్ అయ్యింది. ఇప్పుడు రెండవ సాంగ్‌లోనూ దీపికా తన అందాలతో అందర్నీ స్టన్ చేస్తోంది. క్వీన్ పద్మిని, భర్త రావల్ రతన్ సింగ్ మధ్య సాగే ప్రేమ సన్నివేశాలను ఈ సాంగ్‌లో చూపించారు దర్శకుడు భన్సాలీ. ఏక్ దిల్ ఏక్ జాన్ సాంగ్‌ను ఏఎం తురాజ్ రాశాడు. శివమ పాతక్ ఈ ట్రాక్ పాడారు.