ట్రెండింగ్
Epaper    English    தமிழ்

1980ల నాటి లవ్ స్టోరీతో శివబాలాజీ

cinema |  Suryaa Desk  | Published : Tue, Nov 14, 2017, 11:30 AM



సెకండ్ హీరోగా చేసిన చేసిన ఆర్య, స్ట్రైట్ హీరోగా చేసిన "ఇది మా అశోగ్గాడి లవ్ స్టోరీ" సినిమాల కంటే ఎక్కువ గుర్తింపు మొన్న వచ్చిన బిగ్ బాస్ షో తో వచ్చింది. బిగ్ బాస్ సీజన్‌ 1తో బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను మెప్పించిన శివాబాలాజీ నిర్మాత‌గా మారి వెండితెర ప్రేక్ష‌కుల‌ను మెప్పించేందుకు సిద్ధ‌మవుతున్నాడు. కాట‌మ‌రాయుడులో ప‌వ‌న్ క‌ల్యాణ్ సోద‌రుడిగా న‌టించిన శివ‌బాలాజీ ఓ మ‌ల్టీ స్టార‌ర్ తో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు. రాజీవ్ క‌న‌కాల‌, శివ‌బాలాజీలు హీరోలుగా న‌టించిన సినిమా "స్నేహ‌మేరా జీవితం". ఈ సినిమా త్వరలో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.





ఈ సినిమా ట్రైల‌ర్ ను దుబాయ్ లో జరిగిన ఓ ప్రైవేట్‌ కార్యక్రమంలో శుక్ర‌వారం విడుద‌ల చేశారు. వేవ్ రెజొనెంట్స్ ఈవెంట్స్ 10వ వార్షికోత్స‌వం సంద‌ర్భంగా జరిగిన కార్య‌క్రమంలో ఆ ట్రైల‌ర్ ను విడుద‌ల చేశారు.ఓ దశలో అతడికి అవకాశాలే లేకుండా పోయాయి. ఐతే ఆ సమయంలోనే సొంతంగా నిర్మాతగా మారి ‘స్నేహమేరా జీవితం' అనే సినిమా మొదలుపెట్టాడు శివబాలాజీ. ఈ సినిమా కొన్ని నెలల కిందటే పూర్తయింది కూడా. కానీ ఇటు ప్రేక్షకుల్లో కానీ.. అటు ట్రేడ్ వర్గాల్లో ఎలాంటి స్పందనా కనిపించలేదు అప్పుడు.1980 బ్యాక్‌డ్రాప్‌లో ఒక యధార్థ ఘటనని ఆధారంగా చేసుకుని ఇద్దరు స్నేహితుల మధ్య జరిగే కథే ఈ సినిమా. ఈ సినిమాలో శివబాలాజీతో పాటు ప్రముఖ నటుడు రాజీవ్ క‌న‌కాల కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తున్నాడు.


శివ‌బాలాజీ స‌ర‌స‌న యు.ఎస్‌కు చెందిన తెలుగు అమ్మాయి, క్లాసిక‌ల్ డ్యాన్సర్ సుష్మ యార్ల‌గ‌డ్డ హీరోయిన్‌గా ప‌రిచ‌యం అవుతోంది.వీళ్లిద్దరి లుక్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. వారి పాత్రలు కూడా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. లవ్.. యాక్షన్.. కామెడీ అన్నీ కలగలిసిన సినిమాలా ఉంది. 80ల నాటి నేటివిటీని బాగానే చూపించినట్లున్నారు. సినిమాపై కొంచెం ఎక్కువే ఖర్చు పెట్టినట్లున్నాడు శివబాలాజీ. ఈ చిత్రాన్ని డిసెంబర్లో విడుదల చేయాలని శివబాలాజీ ప్లాన్ చేస్తున్నాడు. ట్రైలర్ చూశాక ఈ సినిమాకు మంచి బిజినెస్ ఆఫర్స్ వస్తాయని అతను ఆశిస్తున్నాడు.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com