ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మరికాస్త ఆలస్యంగా 'భాగమతి'?

cinema |  Suryaa Desk  | Published : Thu, Nov 16, 2017, 03:02 PM



అనుష్క ప్రధాన పాత్రగా 'భాగమతి' చిత్రం తెరకెక్కింది. దర్శకుడు అశోక్ తెరకెక్కించిన ఈ సినిమా నుంచి ఇటీవలే ఫస్టులుక్ పోస్టర్ వచ్చింది. దాంతో అందరిలోనూ ఈ సినిమాపై ఆసక్తి పెరిగింది. అనుష్క అభిమానులంతా ఈ సినిమా కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. డిసెంబర్లో ఈ సినిమాను విడుదల చేయాలనుకున్నారనీ, అయితే 'హలో' సినిమా వస్తుండటంతో ఆ ఆలోచన మార్చుకున్నారనే వార్తలు వచ్చాయి.  దాంతో ఈ సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వస్తుందనే టాక్ వినిపించింది. సంక్రాంతికి బాలకృష్ణ .. పవన్ కల్యాణ్ వంటి పెద్ద హీరోల సినిమాలు వస్తున్నాయి. అందువలన అప్పుడు కూడా ఈ సినిమా థియేటర్స్ కి రావడం లేదన్నది తాజా సమాచారం. ఇది అనుష్క అభిమానులను నిరాశకు గురిచేసే వార్తే. సాధ్యమైనంత వరకూ ఫిబ్రవరి 9వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారట. లేదంటే మార్చిలోగానీ .. ఏప్రిల్ లో గాని విడుదల కావొచ్చనే మాట ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com