రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డులపై విమర్శలు ఏ స్థాయిలో వస్తున్నాయో అందరికి తెలిసిందే. ఇప్పటికే సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది ప్రముఖులు నంది అవార్డులపై పలురకాల సెటైర్స్ వేశారు. అయితే ఇంకా విలక్షణ దర్శకుడైన రామ్ గోపాల్ వర్మ నుంచి ఏ విధమైన రెస్పాన్స్ లేదు అనుకుంటున్న సమయంలో సోషల్ మీడియాలో సెటైర్ల పర్వం మొదలెట్టేసాడు. పొగుడుతూ కామెంట్ చేసిన వర్మ దర్శకుడైన బోయపాటి గురించి కూడా ఒక సెటైర్ వేశాడు.
“నంది అవార్డు కమిటీకి ఆస్కార్ అవార్డు ఇవ్వాలి.. అబ్బో అబ్బో అబ్బో!!! ఇప్పుడే నంది అవార్డ్స్ లిస్ట్ మొత్తం చూసా… వామ్మో మైండ్ బ్లోయింగ్ ఎక్స్ ట్రార్డినరీ సూపర్ డూపర్ సెలక్షన్ .. నాకు తెలిసి ఇలా ఏమాత్రం 1% పక్షపాతం లేకుండా కేవలం మెరిట్ మీద మాత్రమే అవార్డ్స్ ఇచ్చిన కమిటీ మొత్తం ప్రపంచంలోనే ఉండి ఉండదు.. ఇంత అద్భుతమైన నిజాయతీ గల నంది అవార్డు కమిటీకి ఖచ్చితంగా ఆస్కార్ అవార్డు ఇవ్వాలి .. వావ్.. నంది అవార్డ్స్ కమిటి మెంబర్లూ ఐ వాంట్ టు టచ్ ఆల్ యువర్ ఫీట్” అంటూ పోస్ట్ చేశాడు.
ఇక మరో పోస్ట్ లో “టైటానిక్ జేమ్స్ కెమరూన్ లెజెండ్ బోయపాటి శ్రీను కాళ్ళు పట్టుకుంటాడు. లెజెండ్ సినిమాకి ఇచ్చిన అవార్డుల మీద కాంట్రవర్సీ ఏంటో నాకు అర్థమవ్వట్లేదు.. అది కేవలం జెలసి ఉన్నవాళ్లు కాంట్రవర్సీ చేస్తున్నారు…నిజానికి జేమ్స్ కెమరూన్ గాని లెజెండ్ చూస్తే టైటానిక్ కి తన కొచ్చిన 11 ఆస్కార్ అవార్డుల్ని బోయపాటి శ్రీను కాళ్ళ దగ్గర పెట్టి సాష్టాంగ నమస్కారం పెడతాడు” అని తనదైన శైలిలో రామ్ గోపాల్ వర్మ కామెంట్ చేశాడు.