ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సమంత పిక్స్ చూసిన ఫ్యాన్స్ కి మతులు పోతున్నాయి

cinema |  Suryaa Desk  | Published : Fri, Nov 17, 2017, 04:51 PM



తమిళ నటుడు విశాల్, గ్లామర్ బ్యూటీ సమంత ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం ఇరుంబు థిరై. తెలుగులో ఈ చిత్రం అభిమన్యుడు గా రిలీజ్ కానుంది. పీయస్ మిత్రన్ దర్శకత్వంలో విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై హరి గుజ్జలపూడి నిర్మిస్తున్న ఈ చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్ కీలకపాత్రలో నటిస్తున్నారు. సంక్రాంతికి విడుదల కానున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ నవంబర్ 18న విడుదల చేస్తున్నట్టు టీం ప్రకటించింది. ఇక తాజాగా సమంత ఈ మూవీలో తన లుక్స్ కి సంబంధించి రెండు ఫోటోలు షేర్ చేసింది. ఈ పిక్స్ చూసిన ఫ్యాన్స్ కి మతులు పోతున్నాయి. బ్లూ సారీ లో మ్యాచింగ్ జ్యూయలరీస్ ధరించి ట్రెడిషనల్ లుక్ లో సమంత అదిరిపోయిందని అంటున్నారు. లావిష్ గా తెరకెక్కిన ఈ చిత్రం పాటలు డిసెంబర్ 27న విడుదల కానుండగా, జనవరి 13న మూవీని రిలీజ్ చేయనున్నారు. యువన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com