ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విశాల్ స్టన్నింగ్ ఫస్ట్ లుక్ పోస్టర్

cinema |  Suryaa Desk  | Published : Sat, Nov 18, 2017, 11:23 AM



తమిళ నటుడు విశాల్, గ్లామర్ బ్యూటీ సమంత ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం ఇరుంబు థిరై. తెలుగులో ఈ చిత్రం అభిమన్యుడు గా రిలీజ్ కానుంది. పీయస్ మిత్రన్ దర్శకత్వంలో విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై హరి గుజ్జలపూడి నిర్మిస్తున్న ఈ చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్ కీలకపాత్రలో నటిస్తున్నారు. సంక్రాంతికి విడుదల కానున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ తాజాగా విడుదలైంది. ఇది స్టన్నింగ్ గా ఉండటంతో పాటు అభిమానులని ఎంతగానో అలరిస్తుంది. ఇక సమంత రీసెంట్ గా మూవీలో తన లుక్స్ కి సంబంధించి రెండు ఫోటోలు షేర్ చేసిన సంగతి తెలిసిందే. లావిష్ గా తెరకెక్కిన ఇరుంబు థిరై చిత్రం పాటలు డిసెంబర్ 27న విడుదల కానుండగా, జనవరి 13న మూవీని రిలీజ్ చేయనున్నారు. యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతం అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com