ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రస్తుతం సోషల్ మీడియాలో నీహారిక న్యూ లుక్ తెగ హల్ చల్

cinema |  Suryaa Desk  | Published : Sat, Nov 18, 2017, 01:08 PM



దాదాపుగా మెగా హీరోల వారసులు వచ్చినా హీరోలంతా ఒక ఎత్తయితే ఆ కాంపౌండ్ నుంచి వచ్చిన నీహారిక ఎంట్రీ ఒకెత్తు. హీరోయిన్ గాచేసినా గ్లామర్ పాత్రలు చేసే అవకాశం వెబ్ సిరీస్‌లు, చిన్న తెర‌లో క‌నిపిస్తూ నాగ‌బాబు ముద్దుల కూతురు నిహారిక సంద‌డి చేస్తోంది. ఇటీవ‌ల‌నే తండ్రితో క‌లిసి ఓ వెబ్ సిరీస్ ప్రారంభించారు. దాని ప్రొమోకు విశేష స్పంద‌న వ‌స్తోంది.ఇప్పటికే చాలా భాగం ఆ చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యింది'ఒరు నల్ల నాల్ పాతు సొల్రేన్' అనే టైటిల్ పై రూపొందుతున్న ఈ చిత్రంలో.. స్టార్ హీరో విజయ్ సేతుపతితో పాటు.. కుర్ర హీరో గౌతమ్ కార్తీక్ కూడా నటిస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో నీహారిక న్యూ లుక్ తెగ హల్ చల్ చేసేస్తోంది.


ఈ ఆర్ముగ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంపై కోలీవుడ్ లో మంచి ఆసక్తి కనపడుతోంది. రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించి.. నీహారిక లుక్ బయటకు వచ్చింది. సాంప్రదాయ దుస్తుల్లో కనిపిస్తున్న నీహారిక స్టిల్ ఒక్కసారిగా షాక్ కొట్టించేసింది. ఒంటి నిండా ఆభరణాలు.. ధరించిన దుస్తులు అన్నీ పూర్తి స్థాయి రీగల్ లుక్ లోనే ఉన్నాయి.


ఇప్పటివరకూ ఈ సినిమా కంటెంట్ గురించి లీక్ కాకపోయినా.. నీహారిక లుక్ ను చూస్తే మాత్రం.. ఈ చిత్ర కథపై ఊహాగానాలు మొదలైపోయాయి. మరోవైపు.. కోలీవుడ్ అరంగేట్రంలోనే నీహారిక పై అంచనాలను పెంచేందుకు ఈ సాంప్రదాయ లుక్ బాగా ఉపయోగపడుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com