అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసే నటి నయనతార పుట్టినరోజు ఇవాళ. నేటితో జన్మించి 32 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినీ ప్రముఖులు ఆమెకు సోషల్ మీడియాలో విషెస్ తెలిపారు. వారందరిలోనూ నయనతారకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ తమిళ దర్శకుడు విఘ్నేశ్ శివన్ చేసిన ట్వీట్ అందరినీ ఆకట్టుకుంటోంది. గత కొద్దికాలంగా వీరిద్దరూ డేటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వారిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. ఇలాంటి సమయంలో విఘ్నేశ్ శివన్ చేసిన ట్వీట్ అందరి అనుమానాలను నిజం చేస్తోంది.
'నేను ఎంతో గౌరవించే మహిళకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇలాగే ధైర్యంగా, అందంగా ఉండు. నయనతార అంటే ఏంటో చూపిస్తూ ఉండు. నిన్ను చూస్తే ఎప్పుడూ గర్వంగానే ఉంటుంది. నా ప్రేమ, గౌరవం నీకే నా తంగమ్మే' అని విఘ్నేశ్ ట్వీట్ చేశాడు. వాళ్లిద్దరూ కలిసి ఉన్న ఫొటోను కూడా విఘ్నేశ్ షేర్ చేశాడు. ఇటీవల నయనతార నటించిన 'ఆరమ్' సినిమా మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే.