ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సవ్యసాచిలో చైతూ లుక్ కొత్తగా ఉంటుంది: చందూ మొండేటి

cinema |   | Published : Sun, Nov 19, 2017, 02:08 PM



తొలి చిత్రం 'కార్తికేయ'తోనే దర్శకుడిగా తానేమిటనేది చందూ మొండేటి నిరూపించుకున్నాడు. ఆ తరువాత ఆయన తెరకెక్కించిన 'ప్రేమమ్' సినిమా కూడా ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా యూత్ లో ఆయనకి మరింత క్రేజ్ ను తెచ్చిపెట్టింది. ఈ నేపథ్యంలో ఆయన తన మూడవ సినిమాగా 'సవ్యసాచి'ని సెట్స్ పైకి తీసుకెళ్లాడు. నాగచైతన్య కథానాయకుడిగా ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో చైతూ చాలా కొత్తగా కనిపిస్తాడనీ .. ఆయన నటనలో కొత్తకోణం ఈ సినిమాలో కనిపిస్తుందని చందూ మొండేటి అన్నాడు. టైటిల్ కి న్యాయం చేసేలా ఈ సినిమా ఉంటుందనీ, యాక్షన్ తో పాటు ఎమోషన్ సీన్స్ కూడా ఆడియన్స్ కి కనెక్ట్ అవుతాయని చెప్పాడు. ఎమోషనల్ సీన్స్ ఈ సినిమాకి ప్రత్యేకంగా నిలుస్తాయని అన్నాడు. నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాకి, కీరవాణి సంగీతాన్ని అందిస్తోన్న సంగతి తెలిసిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com