ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టాలీవుడ్ సెక్సీయస్ట్ భామల్లో ముందు వినిపిస్తున్న పేరు పూజాదే

cinema |  Suryaa Desk  | Published : Mon, Nov 20, 2017, 10:07 AM



ముందు చాలా పద్ధతైన పాత్రలతోనే టాలీవుడ్ లో అడుగు పెట్టింది కన్నడ ముద్దుగుమ్మ పూజా హెగ్డే. ఒక లైలా కోసం.. ముకుంద సినిమాల్లో సాంప్రదాయక పాత్రలతో అందంగా కనిపించింది. కానీ ఆమెలో ఉన్న గ్లామర్ కంటెంట్ ను బయటపెట్టింది మాత్రం దువ్వాడ జగన్నాథమ్ సినిమానే. ఈ సినిమాలో పూజాను అంతా నోరెళ్లబెట్జి చూసేలా తన గ్లామర్ తో అదరగొట్టేసింది. లేటెస్ట్ టాలీవుడ్ సెక్సీయస్ట్ భామల్లో ముందు వినిపిస్తున్న పేరు పూజాదే.


ఒక్కసారిగా ఇంత మార్పు ఎలా సాధ్యమైందంటే ఎంతసేపూ క్యూట్ గర్ల్ గా ఉంటే ప్రేక్షకులను ఎలా మెప్పించగలమని అంటోంది. ‘‘అసలు సెక్సీనెస్ అన్నది వేసుకునే డ్రస్ లో ఉండదు.  ఓ అమ్మాయి మామాలు జీన్స్ ఫ్యాంట్ - వైట్ టీషర్ట్ లో కూడా చాలా సెక్సీగా కనిపించవచ్చు.  ఏదైనా చూసే కళ్లలోనే ఉంటుంది’’ అంటోంది ఈ సొగసరి. ‘‘మామూలుగా యాక్టర్ల లైఫ్ కొన్నిసార్లు చాలా బోరింగ్ గా ఉంటుంది. లాంగ్ షెడ్యూల్స్ లో అయితే రూంకు రావడం.. షూట్ కు వెళ్లడం.. మళ్లీ రూంకు రావడం.. షూట్ కు వెళ్లడం.. ఒక్కోసారి విపరీతమైన అలసట వచ్చి అలా బెడ్ మీదపడి నిద్ర పోతుంటా. నాకైతే అలా అలసిపోవడమే నచ్చుతుంది. అదో థ్రిల్’’ అని చెప్పుకొస్తోంది పూజాహెగ్డే. 


దువ్వాడ జగన్నాథమ్ తరవాత పూజాకు గ్లామర్ రోల్స్ ఆఫర్లు బాగానే వస్తున్నాయి. ప్రస్తుతం బెల్లకొండ శ్రీనివాస్ హీరోగా చేస్తున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీవాస్ డైరెక్టర్. దీంతో పాటు బాలీవుడ్ హిట్టయిన రేస్ సిరీస్ మూడో పార్టులో పూజా హెగ్డే ఓ కీలక పాత్ర చేస్తోంది.  






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com