cinema | Suryaa Desk | Published :
Sun, Aug 25, 2019, 11:46 PM
ఆగస్ట్ 29న షష్ట్యబ్ది లోకి అడుగుపెట్టనున్ననేపథ్యంలో కూడా ఇప్పటికీ టాలీ వుడ్ మన్మధుడు నాగార్జునే అనడంలో సందేహం లేదు ఆరు పదుల వయస్సులోను నవ యువకుడిలా అటు సినిమాల్లోనూ, ఇటు బుల్లి తెర మీద బిగ్ బాస్ సీజన్ 3 కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఐతే ఆ మధ్య మన్మథుడు 2 ప్రమోషన్ కార్యక్రమాలలో నాగార్జున చేతికి చిన్నకట్టుతో కనిపించగా పుట్టిన రోజు ఏర్పాట్లు విషయమై చర్చించేందుకు ఆయన ఇంటికి వెల్లిన అభిమానులకు కూడా ఆరోగ్యం సరిగా లేని కారణంగా అందుబాటులోకి రాలేదని సమాచారం. కాగా జిమ్‌లో కసరత్తులు ఎక్కువగా చేయడం వల్ల చేతి నొప్పి వచ్చిందని అందువల్లే అలా బ్యాండేజ్ కట్టడం జరిగిందని అన్నపూర్ణ స్టూడియో వర్గాలు చెపుతున్నాయి కాగా ఎప్పుడూ ఎంతో యాక్టివ్‌గా కనిపించే నాగార్జున అస్వస్థతకి గురైనట్టు వస్తున్న వార్తలలో వాస్తవం పై మరింత సమాచారం అండాల్సి ఉంది.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com