కాస్త పాపులార్టీ ..డబ్బులు రాగానే సొంత బిజినెస్ లు చేయడం చాల కామన్..ఇక సినిమా ఇండస్ట్రీలో అయితే మరి ఎక్కువ..సినిమాలతో వచ్చిన సొమ్ము ను వేరే వ్యాపారాలలో పెట్టుబడి పెట్టి లాభాలు దక్కించుకుంటారు.. తాజాగా హాట్ భామ సన్నీ సైతం ఓ కొత్త బిజినెస్ మొదలు పెట్టింది. సినిమాలతో పాటు యాడ్స్ లలో నటిస్తూ డబ్బు సంపాదిస్తున్న ఈమె , ఇప్పుడే అదే డబ్బుతో బట్టల వ్యాపారం మొదలు పెట్టింది.అర్చన కొచ్చార్ అనే ఫ్యాషన్ డిజైనర్ తో కలసి.. ‘గుడ్ గాళ్జ్.. బ్యాడ్ బాయ్స్’ అనే బ్రాండ్ ఓపెన్ చేసింది. ప్రస్తుతం ఈ బట్టలను ఆన్ లైన్ లో కొనుక్కోవచ్చు. గతం లో అనుష్క శర్మ, దీపికా పదుకొనె వంటి హీరోయిన్స్ ను కూడా ఇదే తరహాలో వ్యాపారం మొదలు పెట్టి సక్సెస్ అయ్యారు. ఇప్పుడు వారి బాటలోనే సన్నీ నడుస్తుంది.