ట్రెండింగ్
Epaper    English    தமிழ்

`వ‌ర‌ల్డ్ ఫేమస్ ల‌వ‌ర్‌`

cinema |  Suryaa Desk  | Published : Tue, Sep 17, 2019, 12:14 PM



స్టార్ హీరోగా విజ‌య్ దేవ‌ర‌కొండ వరస హిట్ తో దూసుకుపోతున్నాడు.  సీనియ‌ర్ ప్రొడ్యూస‌ర్ కె.ఎస్‌.రామారావు స‌మర్ప‌ణ‌లో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్ బ్యాన‌ర్‌పై క్రేజీ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా క్రాంతి మాధ‌వ్ ద‌ర్శ‌క‌త్వంలో కె.ఎ.వ‌ల్ల‌భ నిర్మిస్తోన్న చిత్రానికి `వ‌ర‌ల్డ్ ఫేమస్ ల‌వ‌ర్‌` అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. రాశీఖ‌న్నా, ఐశ్వ‌ర్యా రాజేశ్‌, క్యాథ‌రిన్ ట్రెసా, ఇజాబెల్లా లెయితే హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు.


డైరెక్ట‌ర్ క్రాంతి మాధ‌వ్ ఈ చిత్రాన్నిసెన్సిబుల్ క‌థాంశంతో అద్భుతంగా తెర‌కెక్కిస్తున్నార‌ని, టైటిల్ జ‌స్టిఫికేష‌న్ తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందేన‌ని చిత్ర యూనిట్ చెబుతుంది. సినిమా టైటిల్‌ను అనౌన్స్ చేసిన మేక‌ర్స్ సెప్టెంబ‌ర్ 20, సాయంత్రం 5 గంట‌ల‌కు ఫ‌స్ట్‌లుక్‌ను విడుద‌ల చేస్తున్నారు. ప్రస్తుతం సినిమా హైద‌రాబాద్‌లో చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటోంది. నేషన‌ల్ అవార్డ్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ గోపీసుంద‌ర్ సంగీతం అందించిన ఈ చిత్రానికి జ‌య‌కృష్ణ గుమ్మ‌డి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com