సొంత ఊరి కోసమే కాదు పరసర గ్రామాల అభివృద్ది కోసం కూడా ఓ యువతి చేసిన సాహసం ఎలాంటిది? అనే కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆర్డిఎక్స్ లవ్’. పాయల్ రాజ్పుత్, తేజస్ కంచర్ల ప్రధాన పాద్రధారులు. శంకర్ భాను దర్శకుడు సి.కల్యాణ్ నిర్మిస్తున్నారు. ఇటీవలే టీజర్, ఆ తర్వాత ట్రైలర్ విడుదల చేశారు. మంచి స్పందన రావడంతో పాటుగా పాయల్ రాజ్పుత్ డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. ఆమె అభినయం చూసి దర్శకుడు వినాయక్ మరో విజయశాంతి అవుతుందని ప్రశంసించారు. సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. అక్టోబర్ 11న సినిమాను విడుదల చేయనున్నట్టు చిత్ర నిర్మాత సి.కల్యాణ్ తెలిపారు. రధన్ సంగీతం, సి.రాంప్రసాద్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ఇతర పాత్రల్లో నరేష్, ఆదిత్య మీనన్, నాగినీడు, తులసి, ఆమని, ముమైత్ ఖాన్, దేవిశ్రీ తదితరులు నటిస్తున్నారు.