హీరోయిన్ ప్రియాంక చోప్రా తన భర్తను సర్ ప్రైజ్ చేసింది. భర్త నిక్ జొనాస్ బర్త్ డే సందర్భంగా సోషల్ మీడియా వేదికగా తన భర్తపై ఉన్న ప్రేమను చెబుతూ ఓ పోస్టు చేశారు. నాజీవితానికి కొత్త వెలుగునిచ్చావు. నీతో కలిసి ఉండటం ఎప్పుడూ కొత్తగానే ఉంటుంది. ప్రపంచంలో ఉన్న ఆనందం మొత్తం నీతోనే ఉంది. నా భర్తగా ఉన్నందుకు కృతజ్ఞతలు. హ్యాపీ బర్త్ డే జాన్ లవ్ యూ అని పేర్కొన్నారు. అంతేకాకుండా భర్త కాన్సర్ట్ లో పాల్గొన్న ప్రియాంక ఓ గులాబీ ఇచ్చి ముద్దు పెట్టుకున్నారు. అనంతరం నిక్ బృందంలో కలిసి పాట పాడుతూ, కేక్ తినిపించి డ్యాన్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.