ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పవన్ కళ్యాణ్ ఒక పర్వతం: హరీశ్ శంకర్

cinema |  Suryaa Desk  | Published : Fri, Sep 20, 2019, 04:45 PM



పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, స్టార్ డైరెక్టర్ హరీశ్ శంకర్‌ల కాంబినేషన్‌లో వచ్చిన గబ్బర్ సింగ్ టాలీవుడ్‌లో ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిన విషయమే. అయితే, గబ్బర్ సింగ్ 2 కూడా హరీశ్ శంకర్ తెరకెక్కిస్తారని అంతా అనుకుంటే అలా జరగలేదు. దీంతో వీరిద్దరి మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయనే ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో హరీశ్ శంకర్ ఈ విషయంపై తాజాగా స్పందించారు. పవన్ కళ్యాణ్‌తో గబ్బర్ సింగ్ తర్వాత మరో సినిమా తీయాలనుకున్నా.. కానీ గబ్బర్ సింగ్ 2 తీయాలని అనుకోలేదని ఆయన చెప్పారు. పవన్ కళ్యాణ్‌తో నాకు విభేదాలు వచ్చాయని అందుకే గబ్బర్ సింగ్ 2 తీయలేదనేది రూమర్ మాత్రమేనని స్పష్టం చేశారు. పవన్ లాంటి స్టార్ హీరోను డీల్ చేస్తున్నప్పుడు కాస్త సస్పెన్స్ ఉండాలన్నారు. పవన్ కళ్యాణ్ ఒక పర్వతం అయితే.. తాను ఒక గులకరాయి లాంటి వాడినని హరీశ్ శంకర్ చెప్పుకొచ్చారు. ఆయనతో తనకు ఎలా విభేదాలు వస్తాయని అన్నారు. తనకు తన స్థాయి వాళ్లకు విభేదాలు అంటే ఒప్పుకోవచ్చుగానీ.. పవన్‌తో విభేదించే స్థాయి తనది కాదని వ్యాఖ్యానించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com