సైరా సినిమాలో హిందీ భాషలో ఎంతగా అమితాబ్ నటించనా అక్కడ సైరా కి క్రేజ్ సరిపోదు. అందుకే అక్కడ సైరా ని భారీగా ప్రమోట్ చెయ్యాలి. ఇప్పటికే సైరా ట్రైలర్ మీద బాలీవుడ్ సెలబ్రిటీస్ ట్వీట్స్ అందరిని ఆకర్షిస్తున్నాయి. అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ లు సైరా ని పొగుడుతూ ట్వీటుతున్నారు. ఇక తాజాగా సైరా టీం బాలీవుడ్ లో సైరా విడుదలకు ముందే బాలీవుడ్ ప్రముఖులకు ఓ స్పెషల్ షో వెయ్యాలనుకుంటుందట. మరి బాలీవుడ్ లో ఏ సినిమా రిలీజ్ అయినా.. ముందే సెలెబ్రిటీ షో ఉంటుంది. అలా ఇప్పుడు రామ్ చరణ్ కూడా సైరా సినిమాని ముందే అక్కడ సెలబ్రిటీస్ అందరిని ఆహ్వానించి ప్రదర్శించడానికి ఏర్పాట్లు చేస్తున్నాడని సమాచారం.