సాహో సినిమాకి యావరేజ్ టాక్ వచ్చినా బాలీవుడ్ లో లాభాల కలెక్షన్స్ సాధించింది. ప్రభాస్ బాహుబలి క్రేజ్ తో సాహో సినిమా అక్కడ హిట్ కలెక్షన్స్ సాధించింది. మరి తాజాగా బోలెడంత హైప్ మధ్యన విడుదల కాబోతున్న సైరా సినిమా కూడా హిందీ లో వర్కౌట్ అవుతుందని తాజాగా విడుదలైన సై రా నరసింహారెడ్డి ట్రైలర్ కొచ్చిన స్పందనే చెబుతుంది. టాలీవుడ్ తో పాటుగా హిందీలో కూడా విడుదలైన సైరా ట్రైలర్ కి రికార్డు స్థాయిలో వ్యూస్ వస్తున్నాయి. సైరా సినిమా మీద హిందీ ప్రేక్షకుల్లో ఎంత ఆసక్తి ఉందొ కూడా సైరా ట్రైలర్ తోనే ప్రూవ్ అయ్యింది. తెలుగులోనే కాదు.. సై రా నరసింహారెడ్డి మీద అన్ని భాషల్లోనూ బోలెడంత క్రేజ్ ఉంది. అమితాబ్ నటించడం ఒక ఎత్తైతే... సైరా సినిమా యాక్షన్ సీన్స్ అన్ని హాలీవుడ్ రేంజ్ లో ఉండడం, యావరేజ్ అనిపించుకున్న సాహో కే పట్టం కట్టిన బాలీవుడ్ జనాలు... ఈ సైరాకీ హిట్ టాక్ వస్తే కలెక్షన్స్ పరంగా రికార్డులు కొల్లగొట్టేయ్యడం ఖాయమంటున్నాయి.