ఇటీవలే నటిగా రెండో ఇన్నింగ్స్ ని ప్రారంభించారు రాధిక. సౌత్ లో అన్ని భాషల్లో నటించేందుకు అంగీకరిస్తున్నారు. ప్రస్తుతం తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం, హిందీ తదితర భాషల్లో చారిత్రక నేపథ్యం ఉన్న భారీ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి దమయంతి అనే టైటిల్ ని నిర్ణయించారు. అరుంధతి, భాగమతి తరహా భారీ హారర్ థ్రిల్లర్ చిత్రమిది. నవరసన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. దీనిని తెలుగులో `సంహారిణి` పేరుతో రిలీజ్ చేయనున్నారు. శ్రీ లక్ష్మి వృషాద్రి ప్రొడక్షన్స్ సమర్పణలో జీఈ గీతా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నవరసన్ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం సంహారిణి. తాజాగా ఈ చిత్రం టీజర్ రిలీజ్ కి సన్నాహాలు చేస్తున్నారు. నటనకు స్కోప్ ఉన్న పాత్రలో సంహారిణిగా రాధిక అద్భుతంగా నటిస్తున్నారని తెలుస్తోంది. ఆర్.ఎస్.గణేష్ నారాయణ్ ఈ చిత్రానికి సంగీతం, పీ.కె.హెచ్ దాస్ సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్: మహేష్ అందిస్తున్నారు.