దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవిత నేపథ్యంలో తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్ తలైవీ అనే చిత్రం తెరకెక్కిస్తున్నాడు.. జయ పాత్రలో కంగనా రనౌత్ నటించనుంది… విష్ణు వర్ధన్ ఇందూరి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ మూవీకి విజయేంద్ర ప్రసాద్, ‘ రజత్ అరోరా కథను అందించారు.. జయ పాత్ర కోసం ఇటీవల అమెరికాలోని లాంజ్ ఏంజెల్స్‌కి వెళ్లిన కంగనా ప్రముఖ హాలీవుడ్ ఫేమస్ ఆర్టిస్ట్ జేసన్ కోలిన్స్ ని కలిసింది. ఆయన తన స్టూడియోలో కంగనాకి ప్రోస్తెటిక్ ట్రీట్మెంట్ చేశారు. కంగనాని జయలలితగా చూపించబోతున్నారు. అయితే ట్రీట్మెంట్ సమయంలో తీసిన ప్రోస్తెటిక్ మేకప్ ఫోటోలని కంగనా సోషల్ మీడియా సిబ్బంది ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు