ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ భారీ చిత్రం కోసం జుట్టుపెంచే పనిలోపడ్డ స్టార్ హీరోస్

cinema |  Suryaa Desk  | Published : Sat, Sep 21, 2019, 09:05 PM



దేశం గర్వించ దగ్గ దర్శకులలో మణిరత్నం ఒకరు. ఈ సెన్సేషనల్ డైరెక్టర్ “పొన్నియిన్ సెల్వం ” పేరుతో ఓ భారీ చిత్రం తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ పీరియాడిక్ చిత్రం పాన్ ఇండియా మూవీగా పలు భాషలలో విడుదల కానుంది. దర్శకుడు మణిరత్నం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసేపనిలో ఉన్నారని సమాచారం. చియాన్ విక్రమ్, కార్తీ, విజయ్ సేతుపతి, జయంరవి,పార్తీబన్, ఐశ్వర్య రాయి,కీర్తి సురేష్ వంటి భారీ తారాగణంతో తెరకెక్కనున్న చిత్రంపై పరిశ్రమలో భారీ అంచనాలున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం కొరకు విక్రమ్, కార్తీ, జయం రవి, విజయ్ సేతుపతి జుట్టు పెంచే పనిలో పడ్డారట. పీరియాడిక్ మూవీ కావడంతో పాత్రలకు పొడవాటి జులపాలు అవసరం అవడంతో మణిరత్నం ఆదేశాల మేరకు వారు ఈపనిలో ఉన్నారని వినికిడి. ఐతే ఈ చిత్రం ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో సెట్స్ పైకెళ్లే అవకాశం కలదు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com