ఈ ఏడాది బాలయ్య ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు చిత్రాలతో ప్రేక్షకులను పలకరించారు. ఆయన తన 105చిత్రాన్ని సీనియర్ దర్శకుడు కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. దర్శకుడు ఈ చిత్ర షూటింగ్ ని శరవేగంగా పూర్తి చేస్తున్నారు. ఇటీవలే రామోజీ ఫిలిం సిటీలో బాలయ్య పై కొన్ని పోరాట సన్నివేశాలు చిత్రీకరించారని వినికిడి. కాగా చిత్ర యూనిట్ ఈ మూవీ టీజర్ విడుదలకు సన్నాహాలు చేస్తున్నారట. వచ్చేనెలలో దసరా కానుకగా బాలయ్య మూవీ టీజర్ ని విడుదల చేయాలని భావిస్తున్నారట. నిర్మాత సి కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో వేదిక, సోనాల్ చౌహాన్ బాలకృష్ణ సరసన హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇటీవలే విడుదలైన బాలయ్య ఫస్ట్ లుక్ కి మంచి ఆదరణ దక్కింది. మొదట్లో ఈ మూవీని సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని, భావించారు. ఐతే కొన్ని అనివార్య కారణాల వలన చిత్ర షూటింగ్ ఆలస్యంగా మొదలైంది. మరి సెంటిమెంట్స్ ని బాగా నమ్మే బాలయ్య సంక్రాంతికే దిగుతాడో లేక వెనక్కి తగ్గుతాడో చూడాలి. మరో నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నటించిన ఎంత మంచివాడవురా మూవీ సంక్రాంతి బెర్త్ ఖాయం చేసుకుంది.