ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నా కంటే తక్కువ వయసున్న వ్యక్తిని పెళ్లిచేసుకోను...!

cinema |  Suryaa Desk  | Published : Sat, Sep 21, 2019, 09:41 PM



యువకథానాయకులతోనూ, మరోవైపు సీనియర్ హీరోలతోనూ నటిస్తూ ఇప్పటికీ బిజీగానే ఉంది చందమామ కాజల్ అగర్వాల్. తనతోపాటు తెరంగేట్రం చేసిన హీరోయిన్లకు అవకాశాలు తగ్గిపోయినప్పటికీ కాజల్ మాత్రం వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది. కాజల్ ప్రస్తుతం `భారతీయుడు-2`, `ముంబై సాగా`, `కాల్ సెంటర్` వంటి సినిమాలతో బిజీగా ఉంది. తాజాగా అభిమానులతో ట్విటర్ ఛాట్ చేసిన కాజల్ పలు ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలిచ్చింది. ప్రభాస్‌తో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉంటుందని, రామ్‌చరణ్ మంచి మనసున్న సూపర్‌స్టార్ అని అభిమానుల ప్రశ్నలకు సమాధానాలిచ్చింది. `నా వయసు 17 సంవత్సరాలు. మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా?` అని ఒక వ్యక్తి కాజల్‌కు ప్రపోజ్ చేశాడు. దీనికి కాజల్ స్పందిస్తూ.. `నా కంటే తక్కువ వయసున్న వ్యక్తిని పెళ్లిచేసుకోన`ని చెప్పింది. అలాగే తనకు వివాహ బంధం మీద నమ్మకముందని, పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు తప్పకుండా చేసుకుంటానని కాజల్ చెప్పింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com